calender_icon.png 4 July, 2025 | 2:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ భద్రతా ప్రమాణాలు పాటించాలి

03-07-2025 12:00:00 AM

విద్యుత్ డీఈఈ చంద్రమౌళి

రాజాపూర్ జూలై 2 : విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ భద్రత సూచనలు పాటించాలని డిఈఈ చంద్రమౌళి అన్నారు. బుధవారం రాజాపూర్ మండల కేంద్రంలోని నిర్వహించిన విద్యుత్ భద్రత వారోత్సవాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజాపూర్ డివిజన్ పరిధిలోని బాలా నగర్,నవాబ్ పెట్,రాజాపూర్ మండల విద్యుత్ సిబ్బందికి భద్రత ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు.

సిబ్బంది విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా రైతులకు సంబంధించి ఎలాంటి సమస్య వచ్చిన వెంటనే విద్యుత్ అధికారులను సంప్రదించాలన్నారు. వర్షాకాలంలో ఈదురు గాలులు ప్రకృతి వైపరీత్యాల వలన తెగిపడిన విద్యుత్ తీగలు విరిగిపోయిన స్తంభాలతో జాగ్రత్తగా ఉండాలన్నారు. పంట పొలాల్లో కరెంటు వైర్లు తెగిపడినప్పుడు సంబంధిత సిబ్బంది దృష్టికి తీసుకు పోవాలని సూచించారు.

నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని, విద్యుత్తు పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉందన్నారు. విద్యుత్ మరమ్మతుల సమయంలో ఎల్సీ తీసుకొనే సమయంలో ఒకటికి పదిమార్లు చెక్ చేసుకోవాలని సూచించారు. వినియోగదారులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా నిత్యం పరివేక్షించాలని పేర్కొన్నారు. అనంతరం విద్యుత్ సిబ్బందికి సామగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏడిఈ నవీన్ కుమార్,ఏఈలు వెంకటేష్,చంద్రశేఖర్,సంతోష్ కుమార్ సిబ్బందిపాల్గొన్నారు.