calender_icon.png 4 July, 2025 | 11:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రమశిక్షణ ఎంతో ముఖ్యం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

03-07-2025 12:00:00 AM

ఖర్గే పర్యటన విజయవంతం పై కాంగ్రెస్ శ్రేణులకు దిశా నిర్దేశం

ఖమ్మం, జులై 2 (విజయ క్రాంతి):రాజకీయాల్లో ఉండాలనుకున్న ప్రతి నాయకునికి, ప్రతి కార్యకర్త కు క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తు మ్మల నాగేశ్వరరావు అన్నారు. జిల్లా కాంగ్రె స్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో బు ధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పు వ్వాళ్ళ దుర్గా ప్రసాద్ అధ్యక్షతన పట్టణ, మండల,గ్రామ బూత్ స్థాయి అధ్యక్షులతో మల్లిఖార్జున ఖర్గే హైదరాబాద్ పర్యటన విజయవంతంపై దిశా నిర్దేశ సమావేశం నిర్వ హించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ము ఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మం త్రి తుమ్మల నాగేశ్వరరావు, పార్లమెంట్ స భ్యులు రామసహాయం రఘురామి రెడ్డి, ఖ మ్మం జిల్లా ఇన్చార్జులు టిపిసిసి మాజీ అధ్యక్షులు డాక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి, చక్కిలం రాజేశ్వర్ రావు, రవీందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరావు మాట్లాడుతూ ఏ స్థాయి నాయకుడైన ప్రజాభిమా నం పొందాలంటే ముందుగా క్రమశిక్షణ అలవర్చుకోవాలని క్రమశిక్షణ లేకుండా ఏ వ్యవస్థలోనైనా రాణించడం కష్టమని తెలిపారు.

జై భీం, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా అఖిల భారత కాంగ్రెస్ అ ధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ నెల 4వ తేదీన హైదరాబాద్ రానున్నారని తెలియజేశారు. ఖమ్మం జిల్లా నుండి అన్ని నియోజక వర్గా ల్లో పట్టణ స్థాయి నుండి బూత్ స్థాయి అధ్యక్షులు వరకూ ఒకరికి ఒకరు సమన్వయ పర చుకొని జిల్లా నుండి భారీగా తరలి ఖర్గే పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.

అనంతరం ఎంపీ రఘురామిరెడ్డి, టీపీసీసి మాజీ అధ్యక్షులు శ్రావణ్ కుమార్ రెడ్డి, శ్రీ చక్కిలం రాజేశ్వర్ రావు, దైద రవీందర్ లు మాట్లాడుతూ ఖమ్మం అంటేనే కాంగ్రెస్ అని రాష్ట్రంలో ఏ జిల్లా లో రాని మెజారిటీ ఖమ్మం జిల్లా నుండే వచ్చిందని అదే ఉత్సాహంతో 4వ తేదీన హైదరాబాద్ లో జరిగే ఖ ర్గే పర్యటన విజయవంతం చేయాలని కో రారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర్ రావు, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మ హమ్మద్ జావేద్‌లు మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో వీరితో పాటు మాజి శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయ ణ, నగర వర్కింగ్ ప్రెసిడెంట్ నాగండ్ల దీపక్ చౌదరి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయ ఇంచార్జి తుమ్మూరు దయాకర్ రెడ్డి, ఖమ్మం బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు య ర్రం బాలగంగాధర్ తిలక్, జిల్లా అ నుబంధ సంఘ అద్యక్షులు కొత్తా సీతారాములు, దొ బ్బల సౌజన్య, మొక్కా శేఖర్ గౌ డ్, బొడ్డు బొందయ్య, సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, సయ్యద్ గౌస్, రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి యడ్లపల్లి సంతోష్,మిక్కిలినేని నరేంద్ర, సాధు రమేష్ రెడ్డి,నగర ఓ బీసీ, ఐ యన్‌టియుసి, నాయకులు పాల్గొన్నారు.