calender_icon.png 8 January, 2026 | 2:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ శాఖ ప్రజాబాట

06-01-2026 07:27:39 PM

మంచరామిలో సమస్యల గుర్తింపు

సుల్తానాబాద్,(విజయక్రాంతి): విద్యుత్ శాఖ  ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మంచరామి గ్రామంలో పర్యటించిన  అధికారులు గ్రామంలో ఉన్న వివిధ సమస్యలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉప్పు లక్ష్మీ, ఉప సర్పంచ్ ఎగుర్ల శ్రీనివాస్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి రాజేష్ కుమార్ పాల్గొన్నారు.  అలాగే ఏఈ దామోదర్ , లైన్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, లైన్మెన్ కుమారస్వామి, జూనియర్ లైన్మెన్లు తదితర విద్యుత్ సిబ్బంది పాల్గొని గ్రామంలో పర్యటించారు.

గ్రామంలో విద్యుత్ సరఫరాకు సంబంధించిన సమస్యలను గుర్తించిన అధికారులు, వాటిని గ్రామ పాలకవర్గ సహకారంతో త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ ప్రజా బాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాల గ్రామంలోనూ విద్యుత్ శాఖ వారు ప్రజా బాట కార్యక్రమాన్ని నిర్వహించారు.