06-01-2026 07:18:20 PM
కొత్తపల్లి,(విజయక్రాంతి): కరీంనగర్ పట్టణం రేకుర్తిలో బిజెపి పశ్చిమజోన్ కన్వీనర్ జాడి బాలారెడ్డి ఆధ్వర్యంలో 19,20 డివిజన్ లలోని బూత్ స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా జాడి బాలారెడ్డి మాట్లాడుతూ 19,20 రెండు డివిజన్ల నుండి బిజెపి అభ్యర్థులు గెలిపించుకొని, కరీంనగర్ నగర మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటా అన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కేంద్రం నుండి 450 కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి డివిజన్లను అభివృద్ధి చేశారని రేకుర్తి విలీన గ్రామంలో వేసిన సిసి రోడ్లు డ్రైనేజీలు పూర్తి కేంద్రం నిధుల నుండి అభివృద్ధి జరిగిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి మూడు సంవత్సరాలు అవుతున్న ఇప్పటివరకు కరీంనగర్ కార్పొరేషన్ కు ఒక్క రూపాయి కూడ ఇవ్వలేదని అన్నారు.
గతంలో కాంగ్రెస్ పార్టీకి, బిఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారని, ఈ ఎన్నికల్లో బిజెపి పార్టీకి అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధులు జాన పట్ల స్వామి, సంకటి శ్రీనివాస్ రెడ్డి,శక్తి కేంద్రం ఇన్చార్జిలు పొన్నాల రాము పర్వతం మల్లేశం, గోదరి నరేష్, గంట్ల నరసింహారెడ్డి, విష్ణు ప్రసాద్, రావు, సాయికృష్ణా రెడ్డి, అన్నాజీ వినీత్, పింగిలి ప్రతాప్ రెడ్డి, నాంపల్లి, శంకర్, రమేష్, ప్రకాష్, ఐలయ్య, చందు, వినీత్, రాహుల్, మల్లికార్జున్, భూమయ్య, మధు, కే అజయ్, రవి నాయక్, శంకరచారి తదితరులు పాల్గొన్నారు.