ఉజ్జయిని బోనాల సందర్భంగా ఏర్పాట్లపై విద్యుత్ శాఖ అధికారుల పరిశీలన
11-07-2026 12:26 AM
సికింద్రాబాద్, జూలై 10: శ్రీ ఉజ్జయిని మహాకాళి ఆషాడ జాతర లష్కర్ బోనాల ఉత్సవాలు పురస్కరించుకొని విద్యుత్ శాఖ టీజీ ఎస్‌పీడీసీఎల్ మెట్రో జోన్ సీజీఎం కరుణాకర్ బాబు, సికింద్రాబాద్ ఇంచార్జి ఎస్‌ఈ బ్రహ్మానందం, ఏడీఈ శివదుర్గాప్రసాద్, ఏఈ కాసం రవికుమార్, తదితర అధికారులు బోనాల పండగకు కావాల్సిన ఏర్పాట్లను పరిశీలించారు.
తెలంగాణలో ప్రతిష్టంగా జరిగే లష్కర్ బోనాలకు ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేయాలని సీజీఎం ఆదేశించారు. అంతేగాకుండా మహంకాళీ టెంపుల్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇనుప స్తంభాలకు రక్షణ కవచాలు ఏర్పాటు చేయాలని, ఎటువంటి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో జనరల్‌బజార్ విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.






