వేగ పరిమితులు పాటించండి.. సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోండి
వెంకటాపురం (నూగూరు)/ జూలై 10 (విజయ క్రాంతి): వేగ పరిమితులు పాటించి సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవాలని. ఎస్‌ఐ వెంకటాపురం కె. తిరుపతి రావు లారీ డ్రైవర్లకు సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఇసుక లారీల డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ కె. తిరుపతి రావు మాట్లాడుతూ... అతివేగంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగి అమాయకుల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు.
ఇసుక లారీ డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, నిర్ణయించిన వేగ పరిమితిలోనే వాహనాలు నడపాలని సూచించారు.అతివేగంగా వాహనాలు నడిపే డ్రైవర్లపై కేసులు నమోదు చేయడంతో పాటు ఈ-చలాన్లు విధిస్తామని హెచ్చరించారు.ఈ సందర్భంగా 10 ఈ-చలాన్లు విధించి రూ.2,000/- జరిమానా విధించినట్లు తెలిపారు. (అర్రివ్- ఎలైవ్) సురక్షితంగా బయలుదేరి, సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోండి‘ అనే సందేశంతో ప్రతి డ్రైవర్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని,తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాలని కోరారు.






