15-10-2025 08:16:14 PM
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆవేదన..
రాంరెడ్డి దామోదర్ రెడ్డి చిత్రపటానికి ఎంపీ నివాళి..
తుంగతుర్తి (విజయక్రాంతి): భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీ రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి లాంటి నాయకుని కోల్పోవడం బాధాకరమని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం దామన్న నివాసంలో దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి చిత్రపటానికి భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ నాయకులతో కలిసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుమారుడు సర్సర్వోత్తం రెడ్డిని పరామర్శించి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నాయకుడిని కోల్పోయిందని, ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీని వీడలేదని ఆయన గుర్తు చేసుకున్నారు.
40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు క్యాబినెట్ హోదాలో, సూర్యాపేట తుంగతుర్తి నియోజకవర్గం వేల కోట్ల అభివృద్ధి పనులు చేసిన ఘనత ఆయనకే దక్కిందని కొనియాడారు. రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డికి రాజకీయాల్లో మంచి అవకాశం కల్పించాలని, తాను స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, విజ్ఞప్తి చేస్తానని కార్యకర్తల ఎదుట హామీ ఇచ్చారు. దాని ఎల్లవేళలా అతను కుటుంబానికి, సూర్యాపేట తుంగతుర్తి నియోజకవర్గం కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సూర్యాపేట మార్కెట్ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి, రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్, సిహెచ్. రమేష్ తుంగతుర్తి, తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లు తీగల గిరిధర్ రెడ్డి, ఎల్సోజు చామంతి నరేష్, మండల అధ్యక్షులు దొంగరి గోవర్ధన్, అవిలమల్లు యాదవ్ నాయకులు గుడిపాటి నర్సయ్య, తిరుమల ప్రగడ కిషన్ రావు, నాగం సుధాకర్ రెడ్డి, పచ్చిపాల సుమతి, దాయం ఝాన్సీ రాజిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గోవర్ధన్, యువజన కాంగ్రెస్ నాయకులు సంకినేని రమేష్, అజయ్ కుమార్, రాములు యాదవ్, అశోక్ యాదవ్, ముత్యాల వెంకన్న, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.