18-02-2026 01:24:13 AM
రూ 3.50 లక్షల, అంచనా వ్యయంతో 24 గంటల కరెంట్
టౌన్‌ఫీల్డర్‌కు మార్చిన విద్యుత్ శాఖ అధికారులు
పినపాక, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం, జానంపేట గ్రామపంచాయతీ పరిధిలోగల కొత్తగుంపు గ్రామంలో నివాసం ఉంటున్న ప్రజలు విద్యుత్ అంతరాయంతో అన్నా ఇక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంగళవారం విద్యుత్ శాఖ డి.ఇ జీవన్ కుమార్, ఏ ఈ వేణుగోపాల్ జానంపేట 24 గంటల విద్యుత్తును అందే విధంగా జానంపేట సర్పంచ్ పూనెం ఉమామహేశ్వరి, ఉప సర్పంచ్ దాట్ల రాజేష్ ఆధ్వర్యంలో విద్యుత్ కనెక్షన్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా డి ఈ జీవన్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టినటువంటి విద్యుత్ సమస్యలపై అధికారులు వచ్చి ప్రజల సమస్యను తేల్చుకొని తగిన పరిష్కారం లభించే విధంగా ప్రజా బాట, పొలం బాట కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఈ కార్యక్రమాల ద్వారా ప్రజల సమస్యలను విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
రైతులు విద్యుత్ సమస్యలు ఉంటే నేరుగా విద్యుత్ శాఖ అధికారుల సంప్రదించాలి కానీ, వారి సొంత ప్రయత్నాలతో విద్యుత్ జోలికి వెళ్ళొద్దని అన్నారు. వ్యవసాయ మోటర్లు వినియోగిస్తున్నటువంటి ప్రజలు ప్లాస్టిక్ సంబంధించిన స్టార్టర్లు, బాక్స్ ను ఉపయోగించాలి తెలిపారు. కొత్తగుంట గ్రామంలో సుమారు మూడు లక్షల 50 వేల రూపాయలతో పినపాక ఏ ఈ వేణుగోపాలరావు 24 గంటల విద్యుత్ అందించడంలో దగ్గరుండి విద్యుత్ పనులు జరిగే విధంగా చూసిన ఏ ఈ వేణుగోపాలన అభినందించారు.
ఈ కార్యక్రమంలో సబ్ ఇంజనీర్ వీరారెడ్డి, లైన్ ఇన్స్పెక్టర్ అహ్మద్, ఏ.ఎల్.ఎం. మురళి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పేరం వెంకటేశ్వరరావు, ఆవుల సునీల్, జరుపుల రాము, విజయ క్రాంతి రిపోర్టర్ అత్తి లక్ష్మీనారాయణ, జానంపేట వార్డు సభ్యులు పాటిబండ్ల సత్యనారాయణ, పోలిశెట్టి హరీష్, పొనుగోటి చందర్ రావు, గ్రామస్తులు తాతనేని సుబ్బారావు, బద్దల మాధవరావు, చలసాని మొగిలయ్య, కందులు జయరాజు, అన్నం అనిల్, బాలకృష్ణ, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.