10 April, 2026 | 3:20 AM

రూ.152 కోట్లు కొల్లగొట్టిన కేటుగాళ్లు

10-04-2026 01:51 AM
  1. 9 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు   
  2. నిజామాబాద్‌లో భారీ సైబర్ మోసం 

నిజామాబాద్ ఏప్రిల్ 9(విజయక్రాంతి): తప్పుడు ధ్రువపత్రాలతో కరెంట్ ఖాతాలు తెరిచి, వాటిని సైబర్ మోసగాళ్లకు విక్రయిస్తున్న ముఠాను నిజామాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్‌ను నాలుగవ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌ప్పెక్టర్ సతీష్ ,సైబర్ క్రైమ్ పోలీస్ సిబ్బంది సహకారంతో నిర్వహించిన దర్యాప్తులో పోలీసులు విజయం సాధిం చారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా మొత్తం 9 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులు ఫేక్ డాక్యుమెం డ్స్‌తో బిజినెస్ అకౌంట్లు తెరిచి, వాటిని సైబర్ నేరాలకు ఉపయోగించే విధంగా అందించి సహకరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఈ అకౌంట్ల ద్వారా కేవలం మూడు నెలల వ్యవధిలో సుమారు రూ. 152 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.ఈ కేసులో నిజామాబాద్, బోధన్, రెంజల్ ప్రాంతాలకు చెందిన మహ్మ ద్ సమీర్, రహీం అలీ, షేక్ అహ్మద్, షేక్ రహీం, మహమ్మద్ జమీల్ అహ్మద్, మహమ్మద్ అర్బాజ్, బొగుడమీది వీరేశం, అబ్దుల్ వాసిమ్, షేక్ సమీర్, ఇఫ్తెఖార్, అశోక్‌తో సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. 

ఈ అక్రమ కార్యకలాపాలు మధ్యవర్తుల ద్వారా జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.మరికొంతమంది వ్యక్తులు ఇందులో ప్రమేయం ఉన్నట్లు వెళ్లడంతో ఆ దిశగా దర్యాప్తు కొనసాగుతోంది.

వారిని త్వరలో గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్పష్టం చేశారు.బ్యాంక్ అధికారులు కస్టమర్ ఇచిన ధ్రువ పత్రాలు సరిగా ధృవీకరించక అకౌంట్లు ఓపెన్ తెరవడానికి అవకాశం ఇస్తూ ఉండడంతో ఈ ముఠా ఈ చర్యలకు పాల్పడుతోందని సీపీ వెల్లడించారు.