calender_icon.png 9 December, 2025 | 8:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్పంచ్ అభ్యర్థికి మద్దతు తెలిపిన ఈఎల్వి ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్

09-12-2025 07:12:10 PM

మర్రిగూడ (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పేద విద్యార్థులకు, ప్రజలకు సాయం చేస్తున్నటువంటి ఈఎల్వి ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ రాజపేట తండా గ్రామానికి చెందిన బీసీ నాయకుడు, సర్పంచ్ అభ్యర్థి కొండల్ ముదిరాజ్ కి సహాయం చేసి మద్దతు తెలిపారు. అభివృద్ధి పరంగా గ్రామంలో ఒక గ్రంథాలయం, యువకులకు ఒక(జిమ్) వ్యాయామశాల, గ్రామంలో 3 మంచినీటి వాటర్ ప్లాంట్లు తన సొంత నిధులతో ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామాలలో యువకులు ప్రజాప్రతినిధులు కావాలని, ప్రజలు అభివృద్ధి చెందాలని ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ వివరించారు. గ్రామంలో ప్రజలు భాస్కర్ కి నీరాజనాలు పలికారు.