ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ల డిమాండ్
హైదరాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి): తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసో సియేషన్ ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం మంగళవారం స్థానిక టీజీవో భవన్‌లో అధ్యక్ష, కార్యదర్శులు కొంగర వెంకటేశ్వరరావు, మోదుగు వేలాద్రి అధ్యక్షతన నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో వారు మా ట్లాడుతూ.. ఉద్యోగులకు రావలసిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని, బకాయి పడ్డ డీఏ లను విడుదల చేయాలని, పీఆర్సిని అమలు చేసి మెరుగైన పీఆర్సి ఇవ్వాలని, ఉద్యోగులు దాచుకున్న జిపిఎఫ్, టిఎస్‌జిఎల్‌ఐ, సరెండర్ లీవ్, బకాయిలను, రిటైర్మెం ట్ బెనిఫిట్స్‌లను విడుదల చేయాలని కోరా రు.
హెల్త్ కార్డులను మంజూరు చేయాలని, సెప్టెంబర్ నెలలో జరగవలసిన డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీని ఏర్పాటు చేసి వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులకు ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. ఈ మధ్యన విడుదల చేసిన కొన్ని బకాయిలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ పెండింగ్ లో ఉన్న అన్ని రకాల బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని తీర్మానించారు. 2026 సం వత్సరపు నూతన డైరీ గురించి కూడా కార్య వర్గంలో చర్చించారు. ప్రభుత్వ పథకాలను, కార్యక్రమాలను టీజీవో డైరీ ద్వారా యాడ్ రూపంలో ఇవ్వడానికి కలెక్టర్, జిల్లా అధికారులు సహకరించాలని కోరారు.
2026 టీజీ వో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా వేగవంతం చేయాలని తీర్మానించారు. నూతనంగా రాష్ట్ర కార్యవర్గంలో ఖమ్మం జిల్లా నుండి ఎన్నికైన కొండపల్లి శేషు ప్రసాద్‌ని సన్మానించారు. జిల్లా కార్యవర్గంలో ఖాళీ అయిన స్థానాలకు జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ 2గా గంగవరపు నరేందర్ సబ్ రిజిస్టర్‌ను, ఉపాధ్యక్షుడిగా జి రమేష్‌బాబు హెడ్మాస్టర్‌ని ఏకగ్రీవంగా ఎన్నికున్నారు.
ప్రజాకవి అందెశ్రీకి ఘన నివాళులర్పించారు. ఈ కార్యవర్గ సమావేశంలో అసోసి యేట్ అధ్యక్షుడు మల్లెల రవీంద్ర ప్రసాద్, ట్రెజరర్ సూరంపల్లి రాంబాబు, హౌస్ బిల్లింగ్ సొసైటీ కార్యదర్శి డాక్టర్ పి విజయ్‌కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు కనపర్తి వెంకటేశ్వర్లు, సతీష్, హరీష్, పుష్పరాజ్, సింహాచలం, డాక్టర్ బి బాబు రత్నాకర్, భాస్కర్ రావు, తమ్మిశెట్టి శ్రీనివాస్, బానోతు నాగేశ్వరరావు, మోదు గు వెంకటేశ్వర్లు , మల్లయ్య, తాజుద్దీన్ గెజిటెడ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు




