25 February, 2026 | 11:52 PM

ఆయిల్ పామ్ సాగును విస్తరించాలి

12-11-2025 12:00 AM

ఏడాదికి రెండు లక్షల ఎకరాల చొప్పున సాగు పెంచాలి

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 

హైదరాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి):  ఆయిల్ పామ్ ఉత్పత్తిలో తెలం గాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ  మంత్రి  తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ర్టవ్యాప్తంగా ఆయిల్ పామ్ సాగుకు 12 లక్షలకు పైగా అనువైన భూమి ఉందని, వచ్చే నాలుగేళ్లలో ప్రతి ఏ డాది రెండు లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా పనిచేయాలని మ ంత్రి పేర్కొన్నారు. 

సచివా లయ ంలో సోమవారం ఆయిల్ పామ్ కంపెనీల ప్రతినిధులతో మంత్రి తుమ్మల సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాష్ర్టంలో 2.74 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతోందని, ఇందులో 73,696 మంది రైతులు భాగస్వామ్యమయ్యారని వివరించారు. ఆయిల్ పామ్ విస్తరణలో నిర్లక్ష్యం వహించే కంపెనీలపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ప్ర స్తుత ఆర్థిక సంవత్సరంలో తక్కువ పురోగతి ఉన్న జిల్లాలుగా వరంగల్, నారాయణపేట, వనపర్తి, రాజన్న సిరిసిల్ల, గద్వాల్, కరీంనగర్, నిజామాబా ద్, జగిత్యాల, ఆదిలాబాద్ జిల్లాలను గుర్తించినట్టు తెలిపా రు. రాష్ర్టంలో  త్వరలో ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీల కొన్ని ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. వా టిలో నర్మెట్ట (సిద్దిపేట), పెద్దపల్లి, ఖమ్మం, వనపర్తి,  బీచుపల్లి (గద్వాల్), ములుగు జిల్లాలు ఉన్నాయని తెలిపారు.  సమావేశం లో ఉద్యానశాఖ డైరెక్టర్ శ్రీమతి యాస్మి న్ బాషా,  కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.