calender_icon.png 4 September, 2025 | 3:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా వ్యాప్తంగా ఉద్యోగుల నిరసనలు

01-09-2025 06:28:40 PM

పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్

నల్ల చొక్కాలు, టీ షర్టులు, నల్ల బ్యాడ్జీలు ధరించి ఉద్యోగుల నిరసన

జిల్లా ఉద్యోగ జేఏసీ కామారెడ్డి జిల్లా చైర్మన్ నరాల వెంకటరెడ్డి

కామారెడ్డి,(విజయక్రాంతి): పెన్షన్ విద్రోహక  దినాన్ని పాటిస్తూ సోమవారం కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. నల్ల షర్ట్లు, నల్ల టీ షర్ట్ లు, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. కిజీఇ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, రాష్ట్ర సెక్రెటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు ల పిలుపు మేరకు సెప్టెంబర్ 1న పెన్షన్ విధులు ఒక దినంగా పాటించాలని పిలుపునివ్వడంతో కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట జిల్లా ఉద్యోగ జేఏసీ కామారెడ్డి జిల్లా చైర్మన్, టి ఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నరాల వెంకటరెడ్డి అధ్యక్షతన ఆందోళన నిర్వహించారు.

బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి తాలూకా కేంద్రాల్లో మధ్యాహ్న సమయంలో ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్ర్లు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు నల్ల చుక్క టీ షర్ట్ ధరించి నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగి వచ్చి ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ అనేది ఉద్యోగుల పాలిట పెనిషాపంగా మారిందని పెన్షన్ లేక ఉద్యోగులు ఆర్థిక భద్రత లేక వృద్ధాశ్రమంలో ఇంకొకరి మీద ఆధారపడాల్సి వస్తుంది అని అన్నారు. సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దుచేసి పాత పెన్షన్ అమలులోకి తీసుకురావాలని కోరారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయని ఉద్యోగుల పెండింగ్ డీలలతో పాటుగా ఉద్యోగుల పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని కోరారు. ఉద్యోగులకు అత్యంత అవసరమైన ఉద్యోగుల ఆరోగ్య కార్డులు లేక ఆర్థికంగా ఉద్యోగులు నష్టపోతున్నారని తెలిపారు. హెల్త్ కాళ్లు మంజూరు చేసి ఉద్యోగులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వా నీదని గుర్తు చేశారు. అంతేకాకుండా ఉద్యోగులకు రావాల్సిన పిఆర్సి ఆధ్వర్యంలో 51 శాతం ట్రీట్మెంట్ను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఉద్యోగుల పాలిట పెను శాపం గా మారిన సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.