01-09-2025 06:04:44 PM
నకిరేకల్,(విజయక్రాంతి): గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సిపిఎం మండల కమిటీల ఆధ్వర్యంలో కట్టంగూరు, నకిరేకల్ ,కేతపల్లి మండలాల్లో తహాశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఆయా మండలాల్లో తహాశీల్దార్ కు అందించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల నకిరేకల్ ధర్నాలో మాట్లాడుతూ గ్రామ పంచాయతీలలో మురికి కాలువలు మురికితో పేరుకుపోయిన పోయాయని విమర్శించారు. దీంతో ప్రజలకు ప్రజలకు విష జ్వరాలు వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని ఆమే ఆందోళన వ్యక్తం చేశారు.
నివారణ కోసం దోమల మందులు స్ప్రే చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సీజనల్ విష జ్వరాలు వస్తున్న సందర్భంగా గ్రామాలలో మెడికల్ క్యాంపులు నిర్వహించి పేదలకు వైద్యం అందించాలని ఆమె కోరారు గ్రామాల్లో అస్తవ్యస్తంగా తయారైన రోడ్లు కోసం నిధులు మంజూరు చేసి మరమ్మతులు చేయించి రవాణా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.గతంలో నడిచిన పల్లె వెలుగు బస్సులును యధావిధిగా అన్ని గ్రామాల్లో నడిపించాలని ఆమె కోరారు. రైతులందరికీ అవసరమైన మేరకు యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.