calender_icon.png 11 November, 2025 | 6:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగులు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి

11-11-2025 05:29:18 PM

ఏరియా జిఎం రాధాకృష్ణ..

మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి ఉద్యోగులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే తమ కుటుంబం, సమాజం బాగుంటుందని తద్వారా, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరం కృషి చేసిన వాళ్ళమవుతామని దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఉద్యోగి తన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని సింగరేణి ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ అన్నారు. పట్టణంలోని సిఈఆర్ క్లబ్ లో మంగళవారం నిర్వహించిన మిషన్ హెల్ది సింగరేణి, ప్రాచీన యోగ దినచర్య, 15 సంవత్సరాల శాస్త్రీయ పరిశోధన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరు తమ ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని, మంచి ఆహారపు అలవాట్లు నేర్చుకోవడం నేటి యువతపై ఆధారపడి ఉందన్నారు.

శారీరక శ్రమ, ఆటలతో పాటు యోగాను కూడా జీవితంలో  భాగంగా అలవాటు చేసుకోవా లని కోరారు. అనంతరం యోగ శిక్షకులు షణ్ముఖ శివచంద్ర (హైద్రాబాద్)  ప్రాచీన యోగా వివరాలు, నిత్య జీవితంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను, ఆహారపు అలవాట్లను, ఉద్యోగులకు వివరించి, తప్పక పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జిఎం జి లలిత ప్రసాద్, ఏఐటియుసి బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్, జీవీటీసీ మేనేజర్ టీ శ్రీధర్, జీవీటీసీ శిక్షకులు అశోక్, డివైపిఎం అసిఫ్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ శంకర్, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ రవి, ఉద్యోగులు పాల్గొన్నారు.