calender_icon.png 11 November, 2025 | 6:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నదాతల సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యం..

11-11-2025 05:25:17 PM

మార్కెట్ చైర్మన్ వినుపాల ప్రకాష్ రావు..

సుల్తానాబాద్ (విజయక్రాంతి): అన్నదాతల సంక్షేమమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం అని సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు అన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోనీ గర్రెపల్లి, భూపతిపూర్, సాంబయ్య గ్రామాల్లో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రకాష్ రావు  ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రకాష్ రావు మాట్లాడుతూ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఆదేశాల మేరకు గింజ కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు.

పెద్దపల్లి నియోజకవర్గంలో రైతుల సంక్షేమం కోసం ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు చేస్తున్న కృషి మరువలేనిది అన్నారు.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యం  తీసుకువచ్చి ప్రభుత్వం మద్దతు ధర పొందాలి అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్ జానీ, సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షులు పడాల అజయ్ గౌడ్, మాజీ సర్పంచులు. సత్యనారాయణ రావు, రమేశ్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బక్కయ్య, రాజిరెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, రైతులు, హమాలీలు, తదితరులు పాల్గొన్నారు.