calender_icon.png 5 May, 2025 | 7:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెడికల్ యాక్షన్ మిస్టరీతో..

08-04-2025 12:00:00 AM

యువ హీరో అశ్విన్‌బాబు నుంచి వస్తున్న మరో చిత్రం ‘వచ్చినవాడు గౌతమ్’. మెడి కల్ యాక్షన్ మిస్టరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కు మామిడాల ఎంఆర్ కృష్ణ దర్శకుడు. అరుణశ్రీ ఎంటర్‌టైన్‌మెంట్స్, గోల్డ్‌లైన్ క్రియేషన్స్ సయుక్తంగా నిర్మిస్తున్నాయి. టీ గణపతిరెడ్డి నిర్మాతగా, ప్రవళ్లిక యోగి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రంలో సాయి రోణక్ క్యామియో రోల్‌లో కనిపించనుండగా.. రియా సుమన్, అయేషాఖాన్, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. మిగతా చిత్రీకరణ పనులు, పోస్ట్ ప్రొడక్షన్‌ను పూర్తిచేసే పనిలో నిమగ్నమైంది మూవీటీమ్.

ఈ సినిమా నుంచి అశ్విన్‌బాబు ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ సోమవారం విడుదల చేశా రు. ఈ పోస్టర్‌లో ఒంటినిండా రక్తం మరకల తో, స్టెతస్కోప్‌తో ఉన్న అశ్విన్‌బాబు లుక్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రానికి డీవోపీ: ఎంఎన్ బాల్‌రెడ్డి; సంగీతం: గౌర హరి.