calender_icon.png 27 July, 2025 | 10:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏడుగురు మావోయిస్టుల ఎన్‌కౌంటర్

27-07-2025 12:00:00 AM

  1. ఛత్తీస్‌గఢ్‌లో నలుగురు, జార్ఖండ్‌లో ముగ్గురు
  2. సంఘటనా స్థలాల్లో ఆయుధాలు స్వాధీనం

బీజాపూర్/రాంచీ, జూలై 26: ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో శనివారం జరిగిన వేర్వేరు ఎన్‌కౌంట ర్లలో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. శనివారం సాయం త్రం ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ అడవుల్లో యాంటీ న క్సల్ ఆపరేషన్ చేస్తున్న భద్రతాబలగాలకు మావోయిస్టులు ఎదురుపడగా.. జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మరణించారు. బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ ఈ విషయా న్ని ధ్రువీకరించారు.

ఇరు వర్గాల నడుమ కాల్పులు కొనసాగుతున్నాయని ప్రకటించారు. జార్ఖండ్ గుమ్లా జిల్లాలో భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు మా వోయిస్టులు మృతి చెందారు. గగ్రా అడవు ల్లో జార్ఖండ్ జన్ ముక్తి పరిషద్ (జేజేఎంపీ) నేత లు సమావేశమయ్యారనే ఇంటలిజెన్స్ సూచనల మేరకు భద్రతా దళాలు దాడులు చేశాయి.

జార్ఖండ్ జాగ్వార్, గుమ్లా పోలీస్ సంయుక్తం గా ఈ ఆపరేషన్‌ను నిర్వహించా రు. సంఘటనా స్థలంలో ఏకే రెం డు ఇన్సాస్ రైఫిళ్లు లభించినట్టు జా ర్ఖండ్ ఐజీ (ఆపరేషన్స్) మైఖేల్. ఎ స్.రాజ్ తెలిపారు. ఆ పరేషన్ ఇంకా కొనసాగుతున్నట్టు ప్రకటించారు.