27-07-2025 12:00:00 AM
పాట్నా, జూలై 26: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం నితీశ్ సర్కారు అనేక హామీలు గుప్పిస్తూ వస్తోంది. తాజాగా బీహార్‌లో రిటైర్డ్ అయిన జర్నలిస్టులకు పెన్షన్‌ను రూ. 6000 నుంచి రూ. 15,000కు పెంచుతున్నట్టు ప్రకటించారు. ‘బీహార్ పత్రకా ర్ సమ్మాన్ పెన్షన్’ పథకం కింద అర్హులైన రిటైర్డ్ జర్నలిస్టులకు ప్రభు త్వం నెలకు రూ.6,000 పెన్షన్ అందిస్తూ వస్తోంది.
ఒక వేళ పెన్షన్ అందుకుంటున్న పాత్రికేయుడు మ రణిస్తే ఆయన భార్యకు రూ. 3,000 ఇచ్చేవారు. ఈ మొత్తాన్ని కూడా నితీశ్ సర్కారు భారీగా పెంచి రూ. 10,000 చేసింది. ఈ మేరకు సం బంధిత శాఖలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రజాస్వామ్యానికి నా లుగో మూలస్తంభం పాత్రికేయులు అని, సమాజాభివృద్ధిలో వారి పాత్ర ఎంతో కీలకం అని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పేర్కొన్నారు.
ఇప్పటికే దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, వితంతు మహిళలకు పెన్ష న్ల పెంపు, 125 యూనిట్ల వరకు ఉచి త విద్యుత్, రాబోయే ఐదేళ్లలో కోటి ప్రభుత్వ ఉద్యోగాలు, ఇతర ఉపాధి అవకాశాలు అంటూ నితీశ్ భారీగా హామీలు గుప్పించారు. ఎన్నికల సం ఘం ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ఇంకా ప్రకటించలేదు.