30-06-2025 03:35:12 AM
240 సీట్లకు అడ్మిషన్లు షురూ
హుస్నాబాద్, జూన్ 29 : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రాంత విద్యార్థుల కల సాకారమైంది. తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్ వి ద్యార్థుల ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా, ఈ సం వత్సరం నుంచే హుస్నాబాద్‌లో శాతవాహన యూనివర్సిటీకి అనుబంధంగా ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీలో తరగతులు ప్రారం భం కానున్నాయి. దీంతో రవాణా, బీసీ సం క్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. మొత్తం 21 ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీలలో ఈ సంవత్సరం హుస్నాబాద్‌లోని ఈ నూతన కళాశాల ఒకటి కావడం విశేషం.
4 కోర్సులు, 240 సీట్లు
హుస్నాబాద్ లోని ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ కోర్సులలో కీలకమైన విభాగా లు అందుబాటులోకి వస్తున్నాయి. ఎలక్ట్రాని క్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ), కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి నాలుగు విభాగాలున్నాయి. ప్రతి విభాగం లో 60 సీట్లతో మొత్తం 240 సీట్లను ప్రభు త్వం మంజూరు చేసింది. ఈ సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభం కావడంతో హుస్నాబాద్ ప్రాంతంతో పాటు సమీప జి ల్లాల విద్యార్థులకు ఉన్నత విద్యను సొంత ప్రాంతంలోనే అవకాశం లభిస్తుంది.
కౌన్సెలింగ్‌కు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం : అడ్మిషన్ల ప్రక్రియ షురూ
ఇప్పటికే ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. విద్యార్థులు తమ రాష్ట్ర స్థాయి ర్యాంకును బట్టి సీ ట్ల కేటాయింపు ఉంటుందన్నారు. హుస్నాబాద్ ప్రాంత విద్యార్థులు, సమీప జిల్లాల వి ద్యార్థులు తమకు వచ్చిన ర్యాంకును బట్టి హుస్నాబాద్ ఇంజినీరింగ్ కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాలని ఆయన సూచించారు.
మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి విజ్ఞప్తి
మొదటి సంవత్సరం అడ్మిషన్ పొందుతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియ జేసిన మంత్రి పొన్నం ప్రభాకర్, హుస్నాబా ద్ ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ఎ లాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించామని చెప్పారు. విద్యార్థులు కౌన్సెలింగ్‌లో ప్రథమ ప్రాధాన్యంగా హుస్నాబాద్ ఇంజినీరింగ్ కాలేజీకి ఆప్షన్ ఇవ్వాలని కోరారు. ఈ నూతన ఇంజినీరింగ్ కాలేజీ ప్రారంభం హుస్నాబాద్ విద్యాభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలవనుంది. ఇది స్థానిక యువతకు ఉన్నత విద్యావకాశాలను అందించడంతో పాటు, ప్రాంతీయ అభివృద్ధికి కూడా దోహదపడుతుందని భావి స్తున్నారు.