9 May, 2026 | 4:47 PM

Breaking News

సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర   •   దూరదర్శన్ భవన్‌లో అగ్నిప్రమాదం.. ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు   •   టీవీకే ప్రభుత్వ ఏర్పాటుపై వీడని సస్పెన్స్.. వీసీకే పార్టీ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ   •   కొత్తగూడెంలో ఘనంగా కంట మహేశ్వరుని కళ్యాణ మహోత్సవం   •   పల్లకి సేవలో వట్టెం వెంకన్న   •   భీమిరెడ్డి నరసింహారెడ్డి 18వ వర్ధంతి   •   మొక్కజొన్న రైతుల ఉసురు తగలదా   •   మూసీలో పడిపోయిన మహిళను కాపాడిన హైడ్రా   •   నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ (ఎన్సిసి) అవగాహన సదస్సు..   •   స్వాములకు ఉచితంగా అన్న ప్రసాదం   •  

కాలనీల సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం

30-06-2025 03:28 AM

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్చెరు, జూన్ 29:శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటా న్చెరు నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు అవుతున్న కాలనీల సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చె రు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పటేల్ గూడ బీహెచ్‌ఈఎల్ మెట్రో ఎంక్లేవ్ కాలనీలో నూతనంగా నిర్మించిన క మ్యూనిటీ హాల్ ను ఆదివారం ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు సంవత్సరాల క్రితం ఏర్పడిన బిహెచ్‌ఎల్ మెట్రో ఎంక్లేవ్ కాలనీతో పాటు సమీప కాలనీల ప్రజల కోసం రూ.7 కోట్లు వెచ్చించి మౌలిక వసతులు కల్పించడం జరిగిందని తెలిపారు.

కాలనీలో గుడి, మసీదు, చర్చి నిర్మాణాల కోసం రూ.30 లక్షల సొంత నిధులు అందించడం జరిగిందని గుర్తు చేశారు. అతి త్వరలో మరో రూ.70 లక్షలు కేటాయించి నిర్మాణాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, సీనియర్ నాయకులు సత్యనారాయణ, జ్ఞానేశ్వర్, రాజు, కృష్ణ, శ్రీకాంత్, మల్లేష్, బీహెచ్‌ఈఎల్ యూనియన్ ప్రతినిధులు రెహమాన్, దామోదర రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.