calender_icon.png 12 November, 2025 | 10:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటమి దిశగా ఇంగ్లండ్ విలియమ్సన్ భారీ సెంచరీ

17-12-2024 12:12:01 AM

హామిల్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ ఓటమి దిశగా పయనిస్తోంది. కివీస్ విధించిన 658 పరుగుల భారీ టార్గెట్‌ను అందుకునే క్రమంలో ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 18 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ నాలుగో రోజు ఏ మేర ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది. జాకబ్ బెతెల్ (9*), రూట్ క్రీజులో ఉన్నారు. అంతకమందు న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 453 పరుగులకు ఆలౌటైంది. కేన్ విలియమ్సన్ (204 బంతుల్లో 156) భారీ సెంచరీతో కదం తొక్కగా.. డారిల్ మిచెల్ (60), టామ్ బ్లండల్ (44 నాటౌట్) రాణించగా.. ఆఖర్లో సాంట్నర్ (49) వేగంగా ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాకబ్ బెతెల్ 3 వికెట్లు పడగొట్టాడు.