దూసుకెళ్తోన్న పశ్చిమ బెంగాల్
మణిపూర్, సర్వీసెస్‌కు విజయాలు
* సంతోష్ ట్రోఫీ
హైదరాబాద్: సంతోష్ ట్రోఫీలో భాగంగా డిఫెండింగ్ చాంపియన్స్ సర్వీసెస్‌తో పాటు మాజీ చాంపియన్స్ పశ్చిమ బెంగాల్ జట్లు వరుస విజయాలతో దూసుకెళ్తున్నాయి. మూడో రోజైన సోమవారం గ్రూప్ భాగంగా బెంగాల్ జట్టు 3 తెలంగాణపై విజయాన్ని నమోదు చేసుకుంది. బెంగాల్ తరఫున నరోహరి శ్రేష్ట (ఆట 45+3వ, 56వ నిమిషంలో), రోబి హన్స్ డా (39వ ని.లో) గోల్స్ సాధించా రు. ఇదే గ్రూప్ లో సర్వీసెస్ జట్టు 4 జమ్మూ కశ్మీర్‌పై గెలుపొందింది. సర్వీసెస్ తరఫున లిథాలెన్ (11వ ని.లో), శ్రేయస్ (26వ ని.లో), రాహుల్ (53వ ని.లో), బిద్యాసాగర్ (54వ ని.లో) గోల్స్ సాధించారు. ఇక మూడో మ్యాచ్‌లో మణిపూర్ 2 తేడాతో రాజస్థాన్‌పై విజయాన్ని అందుకుంది.పట్టికలో బెంగాల్, మణిపూర్, సర్వీసెస్ తొలి మూడు స్థానాల్లో ఉండగా.. తెలంగాణ, జమ్మూ చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి.




