13-11-2025 12:00:00 AM
విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ దాసేశ్వరరావు
హైదరాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి): ఫార్మసీ విద్యతో విద్యార్థులకు అపా రమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫె సర్ వైవీ దాసేశ్వరరావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండ లం దేశ్ముఖి గ్రామంలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో బుధవారం బీ-ఫార్మసీ మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు.
ప్రొఫెసర్ వైవీ దాసేశ్వర రావు మాట్లాడుతూ.. తమ యూనివర్సిటీలో విద్యార్థులను చేర్పించిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు, విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఫార్మా రంగం ప్రాధాన్యత మరింత పెరిగిందని, ఫార్మసీ విద్య అభ్యసించిన వారి కి అవకాశాలకు ఢోకా లేదని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఫార్మా రంగం విస్తరణ, కొత్త ప్రాజెక్టుల కారణంగా ఉపాధి మార్గాలు మరింత విస్తృతమవుతాయని చెప్పారు.
ఫార్మసీ చదివిన విద్యార్థులు ఆస్పత్రుల్లో ఫార్మాసిస్టులుగా మరియు అనలిటికల్, పరిశోధన, అభివృద్ధి, మెడికల్ రేటింగ్స్, డేటా అనాలిసిస్ విభాగాలతోపాటు ప్రభుత్వ రం గంలో డ్రగ్ ఇన్స్పెక్టర్లు, మెడికల్ అండర్ రైటర్లుగా ఉద్యోగాలు సొంతం చేసుకోచ్చన్నారు. పీహెచ్డీతోపాటు పోస్ట్ డాక్టోరల్ కోర్సులు అభ్యసించి పరిశోధన దిశగా అడుగులు వేయొచ్చని, అధ్యాపక వృత్తిలోనూ స్థిరపడొచ్చని వివరించారు.