calender_icon.png 8 December, 2025 | 2:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘హై బిజ్’ వన్ కార్తీక మహోత్సవం

13-11-2025 12:00:00 AM

-14 నుంచి 16 వరకు హైదరాబాద్‌లో ఆధ్మాత్మిక మహా సమ్మేళనం

-ఒకే వేదికపై హోమాలు, వ్రతాలు, అభిషేకాలు, పారాయణాలు

-భక్తులకు ప్రవేశం పూర్తిగా ఉచితం

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 12 (విజయక్రాంతి): మరో అత్యద్భుత ఆధ్మాత్మిక సమ్మేళనానికి భాగ్యనగరం వేదిక కా నుంది. హైబిజ్ వన్ ఆధ్వర్యంలో కార్తీక మహోత్సవం వైభవంగా జరుగనుంది. హో మాలు, వ్రతాలు, అభిషేకాలు, పారాయణాలు ఒకేచోట నిర్వహించనున్నారు. అమీ ర్‌పేట ధరమ్ కరణ్ రోడ్‌లోని ఎంసిహెచ్ గ్రౌండ్‌లో నవంబర్ 14 నుంచి 16వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు.

ఆయా క్రతువుల్లో పాల్గొనే భక్తులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని నిర్వాహకులు మీడియా సమావేశం ద్వారా వెల్లడించారు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజషన్ ఫౌండర్, చైర్మన్ డా.జి.పాండురంగరావు, హైబిజ్ వన్ ఫౌండర్, ఎండీ డాక్టర్ జె. సం ధ్యారాణి, హైబిజ్ టీవీ వ్యవస్థాపకులు ఎం రాజ్ గోపాల్ పాల్గొని మాట్లాడారు.  హైబి జ్ వన్ కార్తీక మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మరిన్ని వివరాలకు 83409 74747 నంబర్‌లో సంప్రదించవచ్చు.