12-11-2025 10:56:55 PM
మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది..
ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అపార్ట్మెంట్ వాసులు..
ముషీరాబాద్ (విజయక్రాంతి): గాంధీనగర్ డివిజన్ జగదాంబ అపార్ట్మెంట్స్ వెనకాల వీధిలో గల సృజన అపార్ట్మెంట్స్ లోని రెండవ అంతస్తులో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. కార్తీక మాసం కావడంతో ఉదయం ఇంటి యజమానులు ఫ్లాట్లో దీపాలు వెలిగించి బయటకు వెళ్లారు. ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నట్లు స్థానికులు తెలిపారని, అదృష్ట వశాత్తూ ప్రాణహాని సంభవించలేదని వినయ్ కుమార్ అన్నారు. ఘటన స్థలంలో అగ్నిమాపక సిబ్బంది, డిఆర్‌ఎఫ్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఎలాంటి ప్రాణాన్ని కలకపోవడంతో అపార్ట్మెంట్ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ముషీరాబాద్ పోలీసు స్టేషన్ ఎస్‌ఐ దుర్గ సిబ్బందితో పరిస్థితిని సమీక్షించారు.