12-12-2025 01:38:08 AM
టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబోలో వస్తున్న తాజాచిత్రం ‘పెద్ది’. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. బాలీవుడ్ సంచలనం జాన్వీకపూర్ ఈ చిత్రంలో రామ్‌చరణ్ సరసన కథానాయికగా నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తుండగా, జగపతిబాబు, దివ్యేందు శర్మ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.
ఈ మూవీ టీమ్ శుక్రవారం నుంచి హైదరాబాద్‌లో కొత్త షూటింగ్ షెడ్యూల్‌ను ప్రారంచనుంది. ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. వాటిలో కొన్నింటిని ఢిల్లీలో చిత్రీకరిస్తారు. జనవరి నెలాఖరు వరకు చిత్రీకరణ కొనసాగుతుంది. అప్పటికల్లా సినిమా మొత్తం టాకీ పార్ట్ పూర్తవుతుందని చిత్రబృందం భావిస్తున్నారు. మరోవైపు పోస్ట్ -ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. 2026, మార్చి 27న పాన్-ఇండియా థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్; డీవోపీ: ఆర్ రత్నవేలు; ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా; ఎడిటర్: నవీన్ నూలి.