12-12-2025 01:36:58 AM
బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అఖండ2’ను అడుగడుగునా అడ్డంకులు వెన్నాడుతు న్నాయి. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కావాల్సిన ఉంది. 4వ తేదీన రాత్రి ప్రీమియర్స్ ప్రదర్శనకు కూడా మేకర్స్ సన్నాహాలు చేశారు. అయితే, ఆ రోజు సాయంత్రమే మద్రాస్ హైకోర్టు సినిమా విడుదలను నిలిపివేస్తూ ఆదేశాలిచ్చింది. అప్పట్నుంచీ సందిగ్ధంలో ఉన్న నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ అధినేతలు బుధవారం కొత్త తేదీ ప్రక టించారు.
ఈ శుక్రవారమే రిలీజ్, అని 11న రాత్రి ప్రీమియర్స్ ఉంటాయని వెల్లడించారు. మరోవైపు ఈ సినిమాకు టికెట్ ధరల పెంపుపై సర్కార్ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ న్యాయవాది శ్రీనివాస్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ను గురువారం దాఖలు చేశారు.
దీంతో న్యాయస్థానం టికెట్ ధరల పెంపు జీవోను రద్దు చేసింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. అయితే, ప్రీమియర్ షోలు యధాతథంగా గురువారం రాత్రి ప్రారంభమయ్యాయి. టికెట్ ధరల విషయంలో హైకోర్టు ఆదేశాలను పాటించాలని, ఎక్కువ ధరలకు విక్రయించవద్దని హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల కంటే ముందే ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకున్నవారు అదనపు రేట్లనే చెల్లించాల్సి వచ్చింది.