calender_icon.png 5 May, 2025 | 12:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలరించిన బుర్రకథ

05-05-2025 12:23:54 AM

మహబూబాబాద్, మే 4 (విజయ క్రాంతి): మారిన నాగరిక ప్రపంచంలో మల్టీప్లెక్స్‌లు, ఓటీటీ ద్వారా సెల్ ఫోన్ల లో సినిమాలను తిలకించే ప్రస్తుత రో జుల్లో మహబూబాబాద్ జిల్లా కేసము ద్రం పట్టణంలోని అమీనాపురంలో బ్రహ్మంగారి జీవిత చరిత్ర వివరించినందుకు ఏర్పాటు చేసిన బుర్రకథ తిలకిం చి భలే బాగుందంటూ కితాబివ్వడం విశేషం.

అమీనాపురం పరిధిలోని శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహం వద్ద బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాల్లో భాగంగా విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో  తొ ర్రూరు మండలం కంఠాయపాలెం కు చెందిన కాకతీయ బుర్రకథ బృందం ఆధ్వర్యంలో శనివారం బుర్రకథ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్ర మానికి పెద్ద ఎత్తున గ్రామస్తులు హాజ రై కథకులు బుర్ర రాము గౌడ్, వంత లు యాకన్న, సోమన్న బ్రహ్మంగారి జీవిత చరిత్ర విశేషాలను తమదైన శైలి లో కనుల విందుగా బుర్రకథను ప్రదర్శించారు.