05-05-2025 08:54:57 AM
న్యూఢిల్లీ: కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ నితిన్ గడ్కరీ(Union Minister Nitin Gadkari) సోమవారం నాడు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. నేడు ఆసిఫాబాద్ జిల్లాలో నితిన్ గడ్కరీ పర్యటన ప్రారంభం కానుంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్రమంత్రి కోమటిరెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేయనున్నారు. జాతీయ రహదారుల ప్రాజెక్టులను నితిన్ గడ్కరీ ప్రారంభించనున్నారు. గడ్కరీ ఉదయం 10.15 గంటలకు కాగజ్ నగర్ కు చేరుకోనున్నారు. దాదాపు రూ. 3.69 కోట్లతో 115.39 కిలో మీటర్ల మేర ఐదు జాతీయ రహదారులు నిర్మించనున్నారు.
ఐదు జాతీయ రహదారులను(Five national highways) నితిన్ గడ్కరీ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 3.30 గంటల వరకు హైదరాబాద్ లోని కన్హా శాతం వనం సందర్శించనున్నారు. సాయంత్రం 4 గంటలకు బీహెచ్ఈఎల్ ఫ్లైఓవర్(BHEL Flyover) ప్రారంభోత్సవంలో పాల్గొనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు అంబర్ పేట్ ఫ్లైఓవర్ ప్రారంభించనున్నారు. అనంతరం కాగజ్ నగర్ సమీపంలోని మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నితిన్ గడ్కరీ( Nitin Gadkari) పాల్గొనమన్నారు. సభా వేదికగా 7 జాతీయ రహదారులను కేంద్రమంత్రులు ప్రారంభించనున్నారు. పలు నూతన వంతెనల నిర్మాణం, రహదారుల విస్తరణకు శంకుస్థాపన చేయనున్నారు.