calender_icon.png 5 May, 2025 | 7:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్‌లోడింగ్‌ను వేగవంతం చేయాలి

05-05-2025 12:23:17 AM

కలెక్టర్ కుమార్ దీపక్

హాజీపూర్ (మంచిర్యాల), మే 4, (విజయక్రాంతి) : కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు వస్తున్న దాన్యాన్ని త్వర త్వరగా అన్ లోడింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్  మిల్లర్లను ఆదేశించారు. ఆదివారం జిల్లాలోని హాజీపూర్ మండలం దొనబండలోని శ్రీరామ రైస్ మిల్, సబ్బ-పల్లిలోని ఎస్.ఆర్.ఎం. రైస్ మిల్లులతో పాటు నంనూర్ గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం తరలింపు సమయంలో మిల్లుకు వచ్చిన వాహనాల నుండి ధాన్యమును త్వరగా దిగుమతి చేసుకొని వెంటనే వాహనాలను తిరిగి పంపించే విధంగా సహకరించాలని కోరారు. ధాన్యం దిగుమతిలో అవసరమైతే హమాలీల సంఖ్య పెంచాలని, కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి, ధాన్యం తరలించేందుకు అవసరమైన లారీల సంఖ్య పెంపొందించడం జరుగుతుందని తెలిపారు.

సన్న రకం వడ్లకు మద్దతు ధరతో పాటు 500 రూపాయల అదనపు బోనస్ అందించడం జరుగుతుందని తెలిపారు. వరి ధాన్యం విక్రయిం-చేందుకు కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీరు, నీడ, ఓ.ఆర్.ఎస్. సౌకర్యాలు కల్పించడంతో పాటు అవసరమైన గోనె సం చులు, టార్పాలిన్లను సమకూర్చడం జరుగుతుందని తెలిపారు.

రైతులు తేమ శాతం లేకుండా నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని తరలించాలని, ఆకరి గింజ వరకు కొనుగోలు చేయడం జరుగుతుందని తెలి-పారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధి కారులు, రైస్ మిల్లు, కొనుగోలు కేంద్రాల నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు.