05-05-2025 12:25:14 AM
బెల్లంపల్లి అర్బన్, మే 4(విజయ క్రాంతి) : బీసీ కులగణను దేశవ్యాప్తంగా చేపట్టాలన్న రాహుల్ గాంధీ పిలుపును కేంద్ర ప్రభుత్వం సందర్భంగా ఆదివారం బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో టీపీసీసీ పరిశీలకులు జిల్లా ఇన్చార్జి జంగా రాఘవరెడ్డితో కలిసి బెల్లంపల్లి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
నియోజవర్గ కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల నిర్మాణ సన్నహక సమావేశాన్నీ పురస్కరించుకొని క్షీరాభి షేకం చేశారు. మండలాల వారిగా క్యాంప్ ఆఫీసులో సమావేశాలకుశ్రీకారం చుట్టారు. ఈ కార్యక్ర-మంలో టీపీసీసీ సభ్యులు రాం భూపాల్, సిహెచ్ శంకర్, మున్సిపల్ మాజీ చైర్మన్ సూరిబాబు, కాంగ్రెస్ జిల్లా నాయకులు రవీందర్ రెడ్డి, పేరం శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ కారుకూరి రామచందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.