calender_icon.png 2 August, 2025 | 11:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజన్న ఆలయంలో పలు విభాగాలను పర్యవేక్షించిన ఈఓ రాధాభాయి..

01-08-2025 11:04:10 PM

వేములవాడ టౌన్ (విజయక్రాంతి): రాజన్న ఆలయంలో శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవస్థానంలోని ముఖ్యమైన విభాగాలైన ప్రసాదముల తయారీ విభాగము, ప్రసాద విక్రయ విభాగము, ప్రోటోకాల్ విభాగములను ఆలయ కార్యనిర్వహణాధికారి రాధాబాయి(Temple Executive Officer Radhabai) శుక్రవారం పర్యవేక్షించారు. ప్రసాదలకు వినియోగిస్తున్న సరుకుల నాణ్యత, భక్తుల సమాచార కేంద్ర విభాగంలోని రిజిస్టర్ల నిర్వహణ, ప్రసాద విక్రయ విభాగంలో టికెటింగ్ సిస్టం సక్రమంగా నిర్వహణ జరగాలని ఉద్యోగులను సూచించారు. భక్తుల సమాచార కేంద్ర విభాగానికి విచ్చేయు భక్తులతో మర్యాదగా ప్రవర్తించాలని, ప్రసాదం నాణ్యతలో ఎటువంటి సమస్య లేకుండా చూసుకోవాలని, ఉద్యోగులు అందరూ సమయ పాలన పాటించాలని సూచించారు.