calender_icon.png 2 August, 2025 | 5:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎరువు.. రైతులకు కరువు

02-08-2025 12:00:00 AM

  1. మొన్నటి వరకు యూరియా.. ఇప్పుడు కాంప్లెక్స్
  2. వర్షాకాలంలో రైతులకు తప్పని కష్టాలు
  3. అధికారులు తనిఖీ చేస్తున్నా పరిష్కారం కానీ సమస్య

నిర్మల్ ఆగస్టు 1 (విజయక్రాంతి) : ఏం కాలము ఏమో.. మా రైతులకు ఎప్పుడు కష్టాలే. మొన్నటి వరకు వానలు కురువలే. వర్షాలు కురిసే అని సంబరపడి పంట ఎదుగుదలకు వేసే ఎరువులు దొరకడం లేదు. మొన్నటి వరకు యూరియా లేకుండే. ఇప్పు డు కాంప్లెక్స్ ఎరువులైన డిఏపి బీస్ బీస్ ఎరువులు లేవంటున్నారు. వరి నాది పెరిగి నాట్లు వేద్దామంటే కాంప్లెక్స్ ఎరువులు దొరకక నాట్లు ఆలస్యం అవుతున్నాయి.

ప్రభుత్వం ఏమో ఎరువుల కొరత లేదంటుంది. మార్కెట్లో ఏమో ఎరువులు లేవంటున్నరు గిట్ల అయితే మేము ఎట్లా బతుకేది అంటూ జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో వానాకాలం సీజన్లో రైతులు సాగు చేసుకుంటున్నా ప్రధాన పంటలైన పత్తి సోయా మొక్కజొన్న వరి తదితర పంటలకు అవసరమయ్యే ఎరువులు లభించకపోగా రైతులు ఎరువుల కోసం దుకాణాల చుట్టూ తిరుగుతున్నట్టు చెప్తున్నారు.

కలుపు తీసి పంట ఎదుగుదలకు వినియోగించుకుని న త్రజని ఎరువులు అయినా యూరియా 10 రోజుల క్రితం వరకు  ఆశించిన స్థాయిలో స్టార్ స్టాక్ లేకపోవడంతో ఇక్కడ యూరి యా ఉంటే అక్కడికి రైతులు తరలి వెళ్లి యూరియా బస్తాల కోసం క్యూలైన్ కట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై ప్రభుత్వం జిల్లా యంత్రాంగం స్పందించి యూరియా కొడతా నివారణకు చర్యలు చేపట్టి దుకాణాలను తనిఖీ చేయడం ప్రారంభించారు.

వ్యవసాయ శాఖ జిల్లాకు అవసరమయ్యే వీర్యం పంపాలని కలెక్టర్ సిఫార్సు మేరకు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో జిల్లాకు 6000 మెట్రిట్టోలలో యూరియా సరఫరా కావడంతో ప్రస్తుతం యూరియా కొడతా సమస్య తీరింది. యూరియా పక్కదారి పట్టకుండా జిల్లాలో చెక్పోస్టులు ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ మండల వ్యవసా య శాఖ అధికారులు నిరంతరంగా తనిఖీలు నిర్మించడంతో యూరియా సమస్య కొద్దిగా తీరిపోయింది

తాజాగా కాంప్లెక్స్ ఎరువుల కొరత

నిర్మల్ జిల్లాలో యూరియా సమస్య పరిష్కరించామన్న నేపథ్యంలోని రైతులకు ఈ సమయంలో అవసరమయ్యే కాంప్లెక్స్ ఎరువులు లభించకపోవడంతో రైతులు ఆందో ళన చెందుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో వర్షాలు కురవడంతో చెరువులు ప్రాజెక్టులు నుండి బోరు బావుల కింద వరి నాట్లు ముమ్మిరమయ్యాయి.

వరి నాట్లు వేసే సమయంలో తప్పనిసరిగా రైతు ఎకరానికి ఒక బస్తా డిఏపి లేదా దాని మోతాదుకు సరిపడు కాంప్లెక్స్ ఎరువులు అయినా 20 20 20, 17 17 20 ఇతర ఎరువులు తప్పనిసరి కావడంతో ఈ ఎరువులు మార్కెట్లో దొరకడం లేదని చాలామంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా లైసెన్సు కలిగిన ఎరువుల దుకాణాల్లో శుక్రవారం డీఏపీ కాంప్లెక్స్ ఎరువులు లేవని నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేయడం ఎరువుల కొరుత దర్పణం పడుతుంది.

నిర్మల్ బైంసా ఖానాపూర్ ముధోల్ ఆయా మండలాలు గ్రామాల్లో ఉన్న ఎరువుల దుకాణాల్లో కాం ప్లెక్స్ ఎరువులు రైతుల డిమాండ్ మేరకు సరఫరా కాకపోవడంతో రైతులు ఎరువుల బస్తాల కోసం అన్వేషణ చేయవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పత్తి పంటకు కలుపు తీసి కాంప్లెక్స్ ఎరువులు వేయవలసి ఉంది. సోయా మొక్క జొన్న పంటలకు పూతకాతదశలో ఉండడంతో ఈ టైంలో కాంప్లెక్స్ ఎరువులు వినియోగిస్తేనే పంట దిగుబడులు వస్తాయని రైతులు అంటున్నారు.

జిల్లావ్యాప్తంగా సాగునీటి వనరుల కింద వారం రోజులుగా రైతు లు వరి నాట్లను ప్రారంభించారు. వరి నారుమలను తయారు చేసిన రైతులు కాంప్లెక్స్ ఎరువులు వేసిన తర్వాతనే నాటు వేయడం జరుగుతుందని ఎరువులు దొరకని కారణంగా నాట్లు వేయడానికి జాప్యం అవుతుం దని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం మాత్రం జిల్లాలో ఎటువంటి కొడతలేదని అధికారికంగా ప్రకటిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఎరువుల కొడతా రైతులను ఇబ్బందికి గురి చేయడంతో అసలుకే మోసం జరిగే అవకాశం ఉన్నందున జిల్లా వ్యవసాయ శాఖ వెంటనే స్పందించాలని రైతులు కోరుతున్నారు.

రెండు మూడు రోజుల్లో కాంప్లెక్స్ ఎరువులు లభించిన పక్షంలో రైతులకు పంటలు ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం వెంటనే రైతుల అవసరాల మేరకు మేరకు ఎరువులను సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు

కృత్రిమ కొరతపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి

నిర్మల్ జిల్లాలో వానాకాలం సీజన్లో రైతులకు అవసరమయ్యే అన్ని రకాల ఎరువుల ను అందుబాటులో ఉంచే విధంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో పంటల సాగు కు అనుగుణంగా ఏ నెలలో ఏ రకమైన ఎరువులు రైతులకు అవసరమో గుర్తించి ప్రభు త్వం ద్వారా తెప్పించుకునేందుకు చర్యలు చేపట్టారు.

వచ్చిన ఎరువులు కూడా పక్కదారి పట్టకుండా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్తుపటు జిల్లా అధికారులు జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఎరువుల రికార్డులను స్టాక్ వివరాలను తనిఖీ చేసి అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

కృత్రిమ కోరు తా పేరు తో అధిక ధరలకు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎరువుల దుకాణం దారులను హె చ్చరిస్తున్నారు. సరిహద్దు ప్రాం తా ల్లో పోలీస్ శాఖ సాయంతో ము మ్మర తనిఖీలు నిర్వహిస్తే మన ఎరువులు అక్కడికి వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు.