రాజన్నను దర్శించిన తొలి ప్రధాని

09-05-2024 12:22:22 AM

రాజన్న సిరిసిల్ల, మే 8 (విజయక్రాంతి): వేములవాడ శ్రీ రాజ రాజేశ్వరస్వామి ఆలయంలో బుధవారం ఉదయం 9 గంటలకు నరేం ద్రమోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజన్న ఆలయంలో ప్రసిద్ధి గాంచిన కోడె మొక్కులు చెల్లించుకున్నారు. పూజలు నిర్వహించిన అనం తరం అర్చకులు భీమాశర్మ, శరత్ ఆయనకు శేషవస్త్రాలు అందించి ఆశీర్వచనం చేసి, స్వామివారి తీర్థప్రసా దాలు అందించారు. ఆలయంలో మోదీ దర్శనం సందర్భంగా ఎస్పీజీ, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పా టుచేశారు. ఆలయంలో క్యూలైన్లలోని భక్తులను మోదీ పలకరిం చారు. గర్భాలయంలో మోదీ పూజ లు చేస్తుంటే, భక్తులు జై శ్రీరామ్ నినాదాలు చేశారు. ఆలయానికి వచ్చిన తొలి ప్రధానమంత్రి కావడంతో భక్తులు, స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం రోడ్డు మార్గంలో బాలానగర్‌లో ఏర్పాటు చేసిన సభకు వెళ్లారు. ఆలయ అభివృద్ధి కోసం ఏమైనా హామీ వస్తుందని స్థానిక భక్తులు, ప్రజలు ఆశించారు. కానీ మోదీ ఏలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.