calender_icon.png 12 February, 2026 | 10:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మికుల కష్టాలను తీర్చడానికే ఎర్రజెండా

12-02-2026 06:51:46 PM

ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు వి.ఎస్. బోస్

ఘట్ కేసర్,(విజయక్రాంతి): కార్మికులకు అండగా వారి కష్టాలను తీర్చడానికి ఎర్రజెండా నిరంతరం పనిచేస్తుందని ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు విఎస్ బోస్ అన్నారు. ఘట్ కేసర్ లో గురువారం నిర్వహించిన కార్మికుల దేశవ్యాప్త సమ్మె విజయవంతం అయ్యింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు వి.ఎస్. బోస్, కె. జయచంద్ర, సిఐటియు నాయకులు చింతల యాదయ్య, సిపిఎం మండల కార్యదర్శి నార్కట్ పల్లి సబిత,  సిపిఐ మండల కార్యదర్శి లొట్టి ఈశ్వర్ మాట్లాడుతూ కేంద్ర  ప్రభుత్వం 29గా ఉన్న లేబర్ కోడ్లను నాలుగు లేబర్ కోడ్లుగా చేసి కార్మికులను కష్టాలపాలు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం రూ. 26వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల రూ. 16 వేలు జీతం ఇచ్చి వెంట వెంటనే బిల్లులు అందజేయాలని  కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రంలో ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను ఉపసహరించుకోవాలని, లేదంటే దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కార్మిక కష్టాలను తీర్చడానికి ఎర్రజెండా నిరంతరం పనిచేస్తుందని వివరించారు.

బహిరంగ సభకు ముందు ఘట్కేసర్ లో పెద్ద ర్యాలీ తీయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు మున్సిపల్ అధ్యక్ష కార్యదర్శులు చంద్రమౌళి, అశోక్, చంద్రశేఖర్, అశోక్, ఎల్లమ్మ, మధ్యాహ్న భోజన కార్మికుల కార్యదర్శి కవిత, ఏఐటియుసి మున్సిపల్ వర్కర్ల కార్యదర్శి రామచందర్, మండల ఉపాధ్యక్షురాలు సునీత దేవి ఎన్ పి ఆర్ డి జిల్లా అధ్యక్షుడు చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు