16-10-2025 01:02:35 AM
సనత్‌నగర్ వైద్య కళాశాల, ఆస్పత్రిని సందర్శించిన మాజీ గవర్నర్
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 15 (విజయక్రాంతి): హైదరాబాద్ సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐసీ వైద్య కళాశాల, ఆస్పత్రి అందిస్తున్న సేవలు అత్యంత అభినందనీయమని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. బుధవారం ఆయ న ఈఎస్‌ఐసీ వైద్య కళాశాల, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని సందర్శించి అక్కడి విద్యార్థు లు, అధ్యాపకులు, రోగులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఈఎస్‌ఐసీ వైద్య కళాశాల డీన్ డాక్టర్ శిరీష్ కుమార్ జి. చవాన్, కళాశాల, ఆస్పత్రి సాధించిన విజయాలు, కొన సాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై దత్తాత్రేయకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సంస్థ పనితీరును, ముఖ్యంగా విద్యార్థులకు అందిస్తున్న ఉన్నత విద్యా ప్రమాణా లను బీమా ఉన్న వ్యక్తులు మరియు వారి కుటుంబాలకు కల్పిస్తున్న ఆరోగ్య సేవలను దత్తాత్రేయ ప్రత్యేకంగా కొనియాడారు.
సమగ్ర ఆరోగ్య సంరక్షణ కోసం ఆయుష్ , యోగా సేవలను కొనసాగించాలని, అలాగే విద్యార్థుల్లో నైతిక విలు వలను పెంపొందించేందుకు ప్రముఖ వ్యక్తులతో అతిథి ఉపన్యాసాలు ఏర్పాటు చేయా లని ఆయన సూచించారు. ఆస్పత్రిలోని డయాలసిస్ యూనిట్, న్యూరోసర్జరీ విభా గం, క్యాథ్ ల్యాబ్, ఆపరేషన్ థియేటర్ల వంటి ముఖ్య సౌకర్యాలను దత్తాత్రేయ పరిశీలించారు.
అక్కడి రోగులు, వారి సహాయ కులతో సంభాషించి, వారికి అందుతున్న చికిత్స, సేవల గురించి ఆరా తీశారు. నాణ్యమైన విద్య, సమగ్ర ఆరోగ్య సంరక్షణను అందిస్తున్నందుకు అధ్యాపకులను, వైద్యులను దత్తాత్రేయ అభినందించారు.