విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయండి
13-05-2026 06:09 PM
బోథ్,(విజయక్రాంతి): అన్ని కులాల వారికి ఏర్పాటు చేసిన విధంగానే విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ వి బుధవారం ఆదిలాబాద్ జిల్లా విశ్వక్ కర్మ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి విన్నవించారు. రాష్ట్రంలో 11 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన విధంగానే తమకు కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లయితే వెనుకబడిన కులములు అభివృద్ధి చెందే ఆస్కారం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సామాన్పల్లి నరసింహులు కోశాధికారి కొత్తపెళ్లి దశరథ్ ఆదిలాబాద్ జిల్లా విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మేడి చల్మా ప్రవీణ్ జిల్లా ఉపాధ్యక్షులు మహేందర్లు ఉన్నారు.






