13 May, 2026 | 7:08 PM

జనాభా గణన అధికారులకు సహకరించండి

13-05-2026 06:11 PM

కాంగ్రెస్ పార్టీ మైనార్టీ మండల అధ్యక్షుడు షౌకత్ పాషా

ఖానాపూర్,(విజయక్రాంతి): ప్రస్తుతం జనాభా గణన జరుగుతున్న తరుణంలో అధికారులకు ప్రజలు సహకరించాలని నిర్మల్ జిల్లా ఖానాపూర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ మండల అధ్యక్షులు సౌఖత్పాషా అన్నారు. ప్రస్తుత జనాభా గననా దేశ నిర్మాణంలో భాగమవుతుందని, ప్రజలు ఓపికతో అధికారులకు సహకరించి, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని సరైన మొబైల్ నెంబర్లను, వివరాలను ఇచ్చి వారికి సహకరించాలని ,సుమారు 15 సంవత్సరాలు తర్వాత దేశంలో ఈ జనాభా లెక్కింపు జరుగుతుందని, తమ వంతు బాధ్యతగా సహకరించి దేశ నిర్మాణంలో పాలుపంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.