02-08-2025 12:31:25 AM
యాదాద్రి భువనగిరి ఆగస్టు 1 ( విజయక్రాంతి ): గ్రామాలలో రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు కొరకు స్థల సేకరణ చేసి ఫైనల్ వెరిఫికేషన్ చేపట్టాలని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్ లోని మినీ మీటింగ్ హాలులో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి తో కలిసి సమీక్షించారు.
ఈ సందర్భంగా భువనగిరి శాసనసభ్యులు మాట్లాడుతూ...భువనగిరి నియోజకవర్గంలో పలు గ్రామాల్లో రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు కోసం స్థల సేకరణ చేసి పేద విద్యార్థులు మంచిగా చదువుకున్నందుకు త్వరత గతిన పనులు పూర్తి చేసుకుని ఏర్పాటు చేసుకునేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.
పోచంపల్లి, వలిగొండ, భువనగిరి కేంద్రాల్లో రెసిడెన్షియల్ స్కూల్స్, భువనగిరి లో డిగ్రీ కళాశాలలు , సబ్ స్టేషన్ లు ఏర్పాటు కోసం అధికారులు యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు. సమావేశంలో సంబంధిత మండలాలు తాసిల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.