02-08-2025 12:29:51 AM
యాదగిరిగుట్ట ఆగస్టు 1 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జన్మ నక్షత్రమైన ’స్వాతి’ సందర్భంగా ఆలయ గిరిప్రదక్షణలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ వెంకట అన్నమాచార్య సేవా సంస్కృతి తెలంగాణ వారు శ్రీమతి మీనాక్షి వారి బృందంచే కూచిపూడి నృత్యం నిర్వహించబడింది. స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.