22 March, 2026 | 9:14 AM

మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనూ నిర్వాసితుల తరలింపు

29-09-2024 12:33 AM

పలు చోట్ల బాధితుల ఆందోళనలు

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 28(విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలోనూ మూసీ నిర్వాసితుల తరలింపు ప్రక్రియను అధికారులు చేపట్టారు. శని వారం మేడ్చల్ జిల్లాలోని చైతన్యపురి, మారుతీనగర్, సత్యనగర్, ఫణి గిరి కాలనీలో నిర్వాసితులు ఆందోళనకు దిగారు. వారికి బీజేపీ నాయ కులు మద్దతిచ్చారు.

కాగా కొత్తపేట జై భవానీనగర్‌కు చెందిన అయిదు కుటుంబాలను అధికారులు వనస్థలిపురంలోని డబుల్ బెడ్రూంలకు తరలించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో పలువురు బాధితులు నిరసన తెలిపారు. 22 కుటుంబాలను అధికారులు జియాగూడ, నార్సింగి వద్ద గల డబుల్ బెడ్రూం ఇండ్లకు తరలించారు. హైదరాబాద్ జిల్లాలోని పురాణాపూల్ దర్వాజ, కాశీబుగ్గ, లంగర్‌హౌస్ ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి.