సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత
30-06-2026 01:22 AM
కొల్చారం జూన్ 29: నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజి రెడ్డి సహకారంతో కొల్చారం మండలం, పైతర గ్రామానికి చెందిన కీర్తిశేషులు పుట్టి అంజమ్మ కుటుంబానికి 60,000 ల సీఎం సహాయనిధి చెక్కును అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కౌడిపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏల్లుగారి శ్రీనివాస్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు కుమ్మరి భూమయ్య, వార్డు సభ్యులు దండం నవనీత సురేష్, కుమ్మరి సత్తయ్య, జజుల కొండయ్య, మడబోయిన శేఖర్, బోయిని అంతయ్య, కుమ్మరి శివ, ఎర్ర షాదుల్లా, కొండ నరసింహులు, చిప్ప రాములు, పుట్టి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.






