26 May, 2026 | 1:26 AM

నేను చేసిన ఈ పాత్ర కమల్ హాసన్ కూడా చేసుండరు!

07-04-2026 12:22 AM

తరుణ్ భాస్కర్ మోడరన్ ఎంటర్టైనర్ ’గాయపడ్డ సింహం’. కొత్త దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పవన్ సాదినేని సమర్పణలో కళ్యాణ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్స్. మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. మేకర్స్ ఇప్పుడు మరొక కీలక పాత్ర.. జేడి చక్రవర్తి బ్రూటల్ ధర్మగా పరిచయం చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేశారు.

మరిన్ని telugu movie news కోసం మా ఎంటర్టైన్మెంట్ విభాగాన్ని చూడండి.

అతని పేరుకు తగినట్లుగా గ్లింప్స్ చిల్లింగ్, స్టైలిష్ గా వుంది. గ్లింప్స్ లాంచ్ ప్రెస్ మీట్ లో జేడి చక్రవర్తి మాట్లాడుతూ.. ‘యాక్టర్స్ అందరికీ కమల్ హాసన్ ఒక కొలమానం. ఆయన చేసిన అన్ని క్యారెక్టర్లు వరల్ సినిమా హిస్టరీలో ఎవ్వరూ చేయలేదు, చేయబోరు. అయితే గాయపడ్డ సింహంలో యాక్టర్గా కాదు, క్యారెక్టర్ పరంగా ఆయనకు రాని అదృష్టం నాకు వచ్చిందని భావిస్తున్నాను. అలాంటి క్యారెక్టర్ ఇందులో చేశాను. ధర్మ క్యారెక్టర్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. క్యారెక్టర్ పరంగా కమల్ హాసన్ కూడా ఇలాంటి పాత్ర చేసి ఉండరు.

అంత గొప్ప పాత్ర ఇందులో చేశాను‘ అన్నారు. డైరెక్టర్ కశ్యప్ మాట్లాడుతూ&గాయపడ్డ సింహం అంటే తరుణ్ భాస్కర్ ఒక్కరే కాదు, ఇంకా ఉన్నారని ముందే చెప్పాను  అది జెడి. తరుణ్ భాస్కర్ తన బెస్ట్ ఇచ్చాడని చాలాసార్లు చెప్పాం. అలాగే జెడి బెస్ట్ సినిమాల్లో మనకు నచ్చిన అన్ని ఎలిమెంట్స్ ఇందులో కనిపిస్తాయి‘ అని చెప్పారు. ప్రొడ్యూసర్ భాను కిరణ్ ప్రతాప్ మాట్లాడుతూ& ‘జెడి ఈ క్యారెక్టర్ చేయడం సినిమాకి చాలా అడ్వాంటేజ్ అయింది. ఆయన ఈ పాత్ర చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆయన సత్యగా ఎంత పాపులర్ అయ్యారో, ధర్మగా కూడా అంతే పాపులర్ అవుతారని నమ్ముతున్నాను‘ అన్నారు.


ఇవి కూడా చదవండి:

లవ్ స్టోరీనే అసలు ట్విస్ట్.. ‘డెకాయిట్’తో షాకింగ్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న అడివి శేష్!

అమెరికన్ నటితో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్!

షాకింగ్ రోల్‌లో మణాల్ ఠాకూర్.. ‘డెకాయిట్’లో రిస్కీ స్టంట్స్ చేసిన హీరోయిన్!

అందరూ మెచ్చేలా బ్యాడ్ బాయ్ కార్తీక్

గోండ్ తెగల నేపథ్యంలో మైసాహో!

చేతక్ స్క్రీన్ అవార్డ్స్ 2025: ‘ధురంధర్’కు 24 నామినేషన్లు

'డెకాయిట్' ప్రాణం పెట్టి చేసిన సినిమా: హీరో అడివి శేష్