ఆ విజువల్ ఇమాజినేషన్ నుంచే ఈ కథ మొదలైంది!
బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా బ్లాక్బస్టర్లతో అలరిస్తున్న అడివి శేష్ పాన్-ఇండియా యాక్షన్-రొమాంటిక్ థ్రిల్లర్ ’డెకాయిట్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. డెకాయిట్ ఏప్రిల్ 10న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హీరో అడివి శేష్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
మీ గత సినిమాల్లో కూడా ప్రేమ కథలు ఉన్నాయి కానీ.. ఈ ప్రేమ కథకి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి?
నా గత సినిమాల్లో ఒక బిగ్ ప్లాట్ఫామ్ చేరుకోవడానికి లవ్ స్టోరీ వుంటుంది. కథలో ఒక చిన్న భాగంగా ఉంటుంది. కానీ ఈ సినిమాలో లవ్ స్టోరీ నే మెయిన్ ప్లాట్ ఫామ్.ఈ మొత్తం సినిమాకి లవ్ స్టోరీయే కారణం. ఒక లవ్ స్టోరీ లో యాక్షన్ చూడ్డానికి వెళ్తే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక యాక్షన్ సినిమాలో లవ్ చూడడానికి వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. ఇందులో ఎమోషన్స్ అన్నీ కూడా ఆర్గానిక్ గా ఉంటాయి.
ఈ కథకు ఏదైనా స్ఫూర్తి ఉందా?
ఒకరోజు ఒక విజువల్ మెటాఫర్ నా మైండ్ లోకి వచ్చింది. ’ఒక బిజీ రోడ్డుపైన ఒక కాంక్రీట్ సిమెంట్ ఫుట్ పాత్ క్రాక్ నుంచి ఒక చిన్న పువ్వు బయటికి వస్తే’...ఈ విజువల్ ఇమాజినేషన్ నుంచి ఈ కథ మొదలైంది. ఒక ఇంటెన్స్ యాంగర్ యాక్షన్ మధ్యలో మధ్యలో లవ్ స్టోరీ తయారు చేశాం.
మీరు ఇప్పటివరకు స్క్రీన్ మీద డాన్స్ చేయలేదు. ఈ సినిమాతో మొదలుపెట్టారు దీనికి కారణమేదైనా ఉందా?
-చిన్నప్పుడు ఫంక్షన్ లో డాన్స్ చేస్తున్నప్పుడు నువ్వు చాలా పొడుగ్గా ఉన్నావు డాన్స్ చేయొద్దు ఎవరో అన్నారు అప్పటినుంచి ఆ ఫీలింగ్ ఎలా ఉండిపోయింది. నాకు నేనే ఆ లిమిట్ పెట్టుకున్నాను. కానీ ఈ సినిమా కోసం ఆ లిమిటేషన్ దాటాను. ఇందులో హరి క్యారెక్టర్ నుంచి చాలా ఇన్స్పైర్ అయ్యాను. తను మొహం మీద మాట్లాడే వ్యక్తి చాలా ఓపెన్ గా ఉండే క్యారెక్టర్. ఈ పాత్ర కోసమే మదనపల్లి యాస ప్రాక్టీస్ చేసి చేసి ఇంట్లో కూడా మాట్లాడటం మొదలు పెట్టాను. నా యాస చూసి మా అమ్మ ’ఏంటి ఇలా మాట్లాడుతున్నావ్’ అన్నారు ( నవ్వుతూ).
ఈ సినిమా స్టంట్స్ చేస్తున్నప్పుడు మీరు ఎదుర్కొన్న ఛాలెంజెస్?
చేజింగులు, స్టంట్స్ చేయడం ఎప్పుడూ టఫ్ ఉంటుంది. మోకాలి గాయం కూడా అయింది. దాని కారణంగా రెండు మూడు నెలలు సినిమా డిలే అయింది. ఆ ఎఫెక్ట్ గూఢచారి 2 పై కూడా పడింది. ఒక 6 నెలలు యాక్షన్ చేయొద్దని డాక్టర్లు సూచించారు. ఈ సినిమాలో ఫైట్స్ తక్కువ స్టంట్స్ ఎక్కువ. పెద్ద పెద్ద మౌంటైన్స్ మీద చేశాం. 45 డిగ్రీల వేడిలో క్లైమాక్స్ చేశాం.
మేజర్ తర్వాత బాలీవుడ్ నుంచి అవకాశాలు వచ్చాయా?
-4 వార్ సినిమాలు అలాగే 2 బయోపిక్ ఆఫర్స్ వచ్చాయి. మేజర్ సందీప్ పేరెంట్స్ కి నా ప్యాషన్ ప్రాజెక్టు అని మేజర్ సినిమా చేశాను. ఇప్పుడు మళ్లీ నేను వార్ సినిమాలు చేస్తే ఎథికల్ గా కరెక్ట్ కాదు. బిగ్ బ్యానర్స్ నుంచి బయోపిక్ ఆఫర్స్ వచ్చాయి. కాకపోతే నాకు కథలు నచ్చలేదు.
మృణాల్ ఠాకూర్ గురించి?
తను అద్భుతమైన నటి. తను సీన్ లో ఉన్న ఎమోషన్ ని బయట కూడా ఫీల్ అవుతుంది. తనతో ఒక సీన్ చేసిన తర్వాత పర్ఫామెన్స్ చూసి నేను చాలా స్ర్పజ్ అయ్యాను. మనం కూడా గేమ్ రైజ్ చేయాలని ఒక కాంపిటీషన్ స్పిరిట్ తో చేశాను.
మీకు ఎలాంటి స్టోరిస్ ఇష్టం?
-నాకు బ్రోకెన్ లవ్ స్టోరీ అంటే చాలా ఇష్టం. అందుకే దేవదాస్ సినిమాని మనం ఎన్ని సార్లు అయినా చూస్తాం. నేను రాసిన ప్రతి సినిమాలో నా లైఫ్ లో జరిగింది ఎంతో కొంత ఉంటుంది. నాకు ఫస్ట్ బ్రేకప్ అయినప్పుడు ఏం అర్థం కాలేదు. అప్పుడు 19 ఏళ్ళు. దాన్నుంచి బయటపడడానికి దాదాపు పదేళ్లు పట్టింది. ఆ బ్రేకప్ జరిగినప్పుడు అర్థం కాని ఒక రెండేళ్లు ఉంది. ఆ ఎమోషన్ ని హరి క్యారెక్టర్ ద్వారా ఛానల్ చేయడానికి ట్రై చేశాను.
మీరు కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటివరకు ఒకేలా కనిపిస్తున్నారు.. ఆ సీక్రెట్ ఏంటి?
నేను స్మ్కోక్, డ్రింక్ చేయను. అలాగే నాన్ వెజ్ కూడా తినను. యుఎస్ లో పెరగడం వల్ల మసాలాలు కారం కూడా ఎక్కువగా తినలేను (నవ్వుతూ).




