26 May, 2026 | 1:24 AM

అందరూ మెచ్చేలా బ్యాడ్ బాయ్ కార్తీక్

07-04-2026 12:24 AM

హీరో నాగ శౌర్య, రామ్ దేశినా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ’బ్యాడ్ బాయ్ కార్తీక్’ చిత్రంతో మాస్ అవతార్ తో రాబోతున్నారు. శ్రీ వైష్ణవి ఫిలమ్స్ బ్యానర్ పై శ్రీనివాస రావు చింతలపూడి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్నది.

మరిన్ని telugu movie news కోసం మా ఎంటర్టైన్మెంట్ విభాగాన్ని చూడండి.

ఈ సందర్భంగా మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో నాగశౌర్య మాట్లాడుతూ.. ‘ఈ సినిమా ఏప్రిల్ 17న రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్లలో చూసి ఆశీర్వదించాలి. ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్ముతున్నాను‘ అన్నారు.

హీరోయిన్ శ్రీదేవి విజయ్కుమార్ మాట్లాడుతూ.. ‘బ్యాడ్ బాయ్ కార్తీక్‘ సినిమా ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదల అవుతుంది. ఈ సినిమాలో నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను. శౌర్యతో ఫస్ట్ టైమ్ వర్క్ చేస్తున్నాను. ఆయన చాలా ట్యాలెంటెడ్. ప్రేక్షకుల ఆశీర్వాదాలు మాకు ఉండాలి‘ అన్నారు. ప్రొడ్యూసర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘ఇది మా ఫస్ట్ సినిమా. శౌర్యతో కలిసి ఒక మంచి సినిమా తీశాం. జీ వారికి ఈ సినిమా చూపించగానే, ఓటిటి రైట్స్తో పాటు డిస్ట్రిబ్యూషన్ కూడా వారే చేస్తామని చెప్పారు. ఈ సినిమా ఎవరినీ నిరాశపరచదు. కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిక్యూటివ్స్ అందరూ చాలా హ్యాపీ‘ అని తెలిపారు.


ఇవి కూడా చదవండి:

లవ్ స్టోరీనే అసలు ట్విస్ట్.. ‘డెకాయిట్’తో షాకింగ్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న అడివి శేష్!

అమెరికన్ నటితో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్!

షాకింగ్ రోల్‌లో మణాల్ ఠాకూర్.. ‘డెకాయిట్’లో రిస్కీ స్టంట్స్ చేసిన హీరోయిన్!

గోండ్ తెగల నేపథ్యంలో మైసాహో!

చేతక్ స్క్రీన్ అవార్డ్స్ 2025: ‘ధురంధర్’కు 24 నామినేషన్లు

'డెకాయిట్' ప్రాణం పెట్టి చేసిన సినిమా: హీరో అడివి శేష్

నేను చేసిన ఈ పాత్ర కమల్ హాసన్ కూడా చేసుండరు!