26 May, 2026 | 12:33 AM

షాకింగ్ రోల్‌లో మృణాల్ ఠాకూర్.. ‘డెకాయిట్’లో రిస్కీ స్టంట్స్ చేసిన హీరోయిన్!

06-04-2026 01:06 AM

అడివి శేష్ హొపాన్-ఇండియా యాక్షన్-రొమాంటిక్ థ్రిల్లర్ ‘డెకాయిట్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలోకి హొరానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ఆ ముచ్చట్లు ఆమె మాటల్లోనే... 

*డెకాయిట్ లో చేసిన సరస్వతి క్యారెక్టర్ చాలా డిఫికల్ట్. అయితే మేకర్స్ ఆ క్యారెక్టర్‌ను యాక్టర్‌కు సులభంగా అర్థమయ్యేలా తీర్చిదిద్దారు. ఒక యాక్టర్‌కు ఛాలెంజ్ ఉన్న క్యారెక్టర్ చేయడం ఎప్పుడూ ఆనందాన్ని ఇస్తుంది. సరస్వతి క్యారెక్టర్ చేయడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. 

*ఈ క్యారెక్టర్‌ను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. నా కెరీర్‌లో ఇది చాలా డిఫరెంట్ రోల్. ఇప్పటివరకు నేను చేయని కొత్త జానర్ ఇది. తప్పకుండా ఈ క్యారెక్టర్ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. ఈ సినిమాలో కొన్ని స్టంట్స్ కూడా చేశాను. చేజింగ్ సన్నివేశాలు, డ్రైవింగ్ సీన్స్ చాలా ఎంజాయ్ చేశాను.

*సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ చిత్రాలతో తెలుగు ఆడియన్స్ నన్ను ఒక తెలుగు అమ్మాయి లాగా అంగీకరించారు. వారి ప్రేమాభిమానాలు ఎప్పటికీ మర్చిపోలేను. మంచి పాత్రలు చేస్తాననే నమ్మకం వారికి ఉంది. సరస్వతి పాత్ర కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది.

*నాకు ఎప్పుడూ ఎక్స్‌పెరిమెంట్ చేయాలని ఉంటుంది. అలాగే నాకు నేనే సర్ర్పైజ్ అవ్వడం ఇష్టం. అలాంటి అవకాశం ఇచ్చిన సినిమా ఇది.

*నాకు కొత్త ఎమోషన్స్ ఉన్న సినిమాలు చేయాలనిపిస్తుంది. ఇప్పటివరకు చేయని క్యారెక్టర్లు చేయాలనే తపన ఉంటుంది. డెకాయిట్ కూడా అలాంటి కొత్త జానర్ సినిమా.

*కథ విన్నప్పుడు సరస్వతి, హరి ఎందుకు డెకాయిట్స్‌గా మారారో అనేది నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. అది మీరు బిగ్ స్క్రీన్ మీద చూడాలి. ఇది ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ.

*సీత క్యారెక్టర్‌కు సరస్వతి క్యారెక్టర్‌కు చాలా పోలికలు ఉన్నాయి. ఈ రెండు పూర్తిగా భిన్నమైన పాత్రలు. సీత లాంటి పాత్రలో నన్ను ఇప్పటికే ఆడియన్స్ చూశారు. నన్ను కొత్తగా చూడాలనుకునే వారికి ఈ సినిమా ఖచ్చితంగా సర్ర్పైజ్ ఇస్తుంది.

*ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో షూట్ చేశాం. సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ అన్నీ స్ర్టైట్ తెలుగు సినిమాలు. కానీ ఇది రెండు భాషల్లో చేయడం నాకు మరింత ఛాలెంజింగ్‌గా అనిపించింది.

ఇలాంటి సినిమా అప్డేట్స్ కోసం మా ఎంటర్‌టైన్‌మెంట్ వార్తలు చదవండి.

*శేష్ స్వయంకషితో ఎదిగిన స్టార్. అలాంటి సెల్ఫ్‌మేడ్ స్టార్‌తో పనిచేయడం గొప్ప అనుభవం. ఆయన సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. రైటింగ్, డైరెక్షన్.. అన్నిట్లోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. చాలా హంబుల్‌గా ఉంటారు.

*ట్రైలర్‌లో ఒక చేజింగ్ సీక్వెన్స్ గమనించే ఉంటారు.. అందులో నేను డ్రైవింగ్ చేశా. నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో కార్ డ్రైవ్ చేసిన మొదటి అమ్మాయి నేనే. యాక్షన్ సినిమాలు నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో అలాంటి యాక్షన్ చేసే అవకాశం దొరికింది.

*ఈ సినిమాకు వర్క్‌షాప్ కూడా చేశాం. కానీ ఆ విషయాలు ఇప్పుడు చెప్పలే ను. ఎక్కువగా అవుట్‌డోర్‌లో షూట్ చేశాం. ము ఖ్యంగా రోడ్లపై డ్రైవింగ్ సీక్వెన్స్‌లు చాలా థ్రి ల్లింగ్‌గా ఉన్నాయి. ఒ క అంబులెన్స్ డ్రైవ్ చేయాల్సి వచ్చింది. దానికి హ్యాండ్ బ్రేక్ ఉండ దు. చాలా రిస్కీ సన్నివేశాలు కూడా చేశాం.


ఇవి కూడా చదవండి:

లవ్ స్టోరీనే అసలు ట్విస్ట్.. ‘డెకాయిట్’తో షాకింగ్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న అడివి శేష్!

అమెరికన్ నటితో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్!

అందరూ మెచ్చేలా బ్యాడ్ బాయ్ కార్తీక్

గోండ్ తెగల నేపథ్యంలో మైసాహో!

చేతక్ స్క్రీన్ అవార్డ్స్ 2025: ‘ధురంధర్’కు 24 నామినేషన్లు

'డెకాయిట్' ప్రాణం పెట్టి చేసిన సినిమా: హీరో అడివి శేష్

నేను చేసిన ఈ పాత్ర కమల్ హాసన్ కూడా చేసుండరు!