calender_icon.png 9 September, 2025 | 1:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటి నంబర్లు ఉన్నా రిజిస్ట్రేషన్లు కావడం లేదు

09-09-2025 12:34:14 AM

ఎన్‌వోసి ఇవ్వమంటూ చేతులెత్తేసిన బల్దియా

కరీంనగర్, సెప్టెంబరు 8 (విజయ క్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థలో వింత పరిస్థితి నెలకొంది. కరీంనగర్ నగరానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఇంటి నెం బర్లతో రిజిస్ట్రేషన్లు కొనసాగుతుండగా ఇక్క డ కమాన్ ప్రాంతంలోని మధు గార్డెన్ ప్రాం తం నుండి గాయత్రీ నగర్, క్యాన్సర్ ఆసుప త్రి వరకు ఉన్న ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు కావ డం లేదు. గ్రామ కార్యదర్శి ఎన్ వో సి ఇస్తే ఇక్కడ రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా ఇక్కడ క రీంనగర్ నగరపాలక సంస్థలో మాత్రం ఎ న్వోసీ ఇవ్వడం లేదు.

గాయత్రీనగర్ కు చెం దిన లక్కపట్ల మధు అవసరాల నిమిత్తం ఇల్లును అమ్మేందుకు సిద్ధంకాగా బల్దియా అధికారులు ఎన్వోసీ ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు వెళ్లండి మేము లెటర్ పంపించామని చెప్పడంతో ఆయన చెప్పులరిగేలా తి రుగుతున్నా, ప్రాధేయపడుతున్నా ఫలితం ద క్కడం లేదు. ప్రభుత్వం ఎన్వోసీ ద్వారా ఇంటి నెంబర్లతో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించినా ఇక్కడ మాత్రం అధికారులు స హకరించడం లేదు. కొందరు లిజిస్ట్రేషన్ ఆఫీస్ లో చేతులు తడిపి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నా అత్యవసర పరిస్థితుల్లో పైస లు లేక అమ్ముకుందామనుకునే మధు లాం టి వారికి చుక్కలు చూపిస్తున్నారు.

ఈ ప్రాం తంలో 70 ఏళ్ల కిందట ఇల్లు నిర్మించినవారికి కూడా నేడు ఇబ్బందులు ఎదురవుతు న్నాయి. కరీంనగర్ నగరపాలక సంస్థ మున్సిపాలిటీగా ఉన్న సమ యంలో మీరు ఇ ల్లు నిర్మించుకోండి.. మే ము ఇంటి నెంబర్లు ఇస్తామంటూ అడ్డగోలు గా అనుమతులు ఇచ్చి నేడు ఎన్వోసీ ఇవ్వడానికి నిరాకరిస్తుండడంతో చాలామంది ఇ బ్బందుల పాలవుతున్నారు. ట్యాంక్ ఏరి యా కింద ఉన్న 502, 503, 523, 524 నుంచి 527 వరకు, 535, 536, 537 : 53 3, 539 నుండి 542 వరకు, 706, 707, 712, 715, 709బి, 710బి, 752, 714, 716, 718, 725, 722బి, 721 సర్వే నంబర్లు అనుమతులు ఇవ్వడం లేదు.

కొత్తగా ఇల్లు కట్టుకు నేవారు మాత్రం దొడ్డిదారిన నిర్మిస్తుండగా ఉన్న ఇల్లు కొనుగోలు, అమ్మకాల విషయం లో ఎన్వోసీ ఇవ్వకపోతుండడంతో ఇబ్బందు లు ఎదురవుతున్నాయి. పురపాలకశాఖ ఉత్తర్వుల ప్రకారం ఎలాంటి ధృవీకరణ పత్రాలు ఇవ్వమని సబ్ రిజిస్ట్రారుకు కూడా సమాచా రం అందించామని బల్దియా అధికారులు విజయక్రాంతికి స్పష్టం చేశారు. అయితే ము న్సిపాలిటీలో రిజిస్ట్రేషన్ కానీవారు వందల సంఖ్యలో ఉన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్లు కాక ఆవేదన చెందుతున్నారు. రకరకాల ధృవ పత్రాలు తీసుకురావాలని చె బుతూ సంబంధిత అధికారులు ఆయా సర్టిఫికెట్లు ఇవ్వక ఇబ్బందులపాలు చేస్తున్నారు. పురపాలక, నగరపాలక సంస్థల పరిధిలో ఇలాంటి కఠిన నిబంధనలు ఎత్తివేయాలని, సులభంగా రిజిస్ట్రేషన్లు అయ్యేలా చూడాలని గాయత్రీనగర్ వాసులుకోరుతున్నారు.