04-11-2025 12:00:00 AM
							కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
జనగామ, నవంబర్ 3 (విజయక్రాంతి): మొంథా తుఫాన్ వల్ల ఇటీవల కురిసిన భారీ వర్షాలకి దెబ్బతిన్న పంటలను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సోమవారం క్షేత్రస్థాయిలో సందర్శించారు. కొడకండ్ల మండలం నర్సింగ పురం, ఏడు నూతల, పాలకుర్తి మండలం ముత్తారం గ్రామంలో దెబ్బతిన్న వరి, పత్తి, టమాట పంటలను కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నష్టపోయిన రైతులను ఆదుకునేలా క్షేత్రస్థాయిలో అధికారులు పని చేయాలన్నారు.
వర్షాలకు దెబ్బ తిన్న పంటలను.. రైతు భరోసా అప్ ద్వారా పంట నష్ట నమోదును పక్కాగా చేయాలన్నారు. వీలైనంత త్వరగా పంట నష్టం నమోదు పూర్తి కావలన్నారు. మళ్ళీ తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో రైతులు... కోత కి వచ్చిన దాన్యాన్ని... త్వరగా కొనుగోలు కేంద్రాలకి తరలించాలన్నారు. పూర్తిగా తడిచి రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం వద్దకు కాకుండా.. నేరుగా బాయిల్ మిల్లుకు తరలించాలి అని పంచాయతీ కార్యదర్శి, రెవెన్యూ సిబ్బంది, వరి ధాన్యం కొనుగోలు కేంద్ర నిర్వాహకులను, వ్యవసాయ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
నర్సింగ పురం గ్రామం లోని తిరుమల రైస్ మిల్లు ను కలెక్టర్ సందర్శించి.. ఎటువంటి తరుగు, కోత లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైస్ మిల్లు నిర్వాహకులను కలెక్టర్ ఆదేశించారు.. చివరగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సందర్శించి.. తేమ వచ్చిన ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేసి.. ట్యాగ్ చేసిన రైస్ మిల్ లకు తరలించాలని.. ప్రతీ కేంద్రంలో సరిపడా టార్ఫాలిన్‌లను అందుబాటులో పెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంబికా సోని, మండల వ్యవసాయ, విస్తరణ అధికారులు తదితరులు పాల్గొన్నారు.