calender_icon.png 4 November, 2025 | 10:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోడల్ స్కూల్ ను సందర్శించిన ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఆఫీసర్

04-11-2025 05:49:59 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి మోడల్ స్కూల్ ను మంగళవారం ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఆఫీసర్ వి.రమణారావు సందర్శించారు. ఇందులో పిల్లల హాజరు శాతం, వివిధ రకాల రికార్డులను, ప్రాక్టికల్ ల్యాబ్ లను పరిశీలించారు. ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి బోధన విధానాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ డా. గోల్డి బాల్బీర్ కౌర్, అధ్యాపకులు పాల్గొన్నారు.